అశ్విన్ నుంచి చాహల్ వరకు.. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు

Published : Aug 27, 2025, 04:59 PM IST

IPL Top Bowlers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్ల జాబితాలో యూజ్వేంద్ర చాహల్ టాప్ లో ఉన్నారు. జాబితాలో సీఎస్కే మాజీ ప్లేయర్, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నారు.

PREV
16
ఐపీఎల్ బౌలింగ్ రికార్డులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నంచి బౌలర్లకు ప్రత్యేక వేదికగా నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో బౌలర్లకు సవాళ్లు ఎక్కువైనా, కొందరు తమ ప్రతిభతో అద్భుత రాణిస్తూ రికార్డుల మోత మోగించారు. 

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్ల జాబితా గమనిస్తే.. యూజ్వేంద్ర చహల్ అగ్రస్థానంలో ఉండగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు కూడా ఈ జాబితాలో చోటుదక్కింది. ఐపీఎల్ లో టాప్ 5 బౌలర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

DID YOU KNOW ?
ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్
ఐపీఎల్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించిన ఘనత లక్ష్మీపతి బాలాజీ పేరిట ఉంది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున పంజాబ్ కింగ్స్‌పై ఈ హ్యాట్రిక్ సాధించాడు. 2025 ఎడిషన్ వరకు ఐపీఎల్ లో మొత్తం 23 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.
26
1. యూజ్వేంద్ర చాహల్

భారత లెగ్ స్పిన్నర్ యూజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన 174 మ్యాచ్‌లు ఆడి 221 వికెట్లు తీశారు. ఆయన బౌలింగ్ సగటు 22.76. 

2024లో చాహల్ ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్ల మార్కును దాటిన తొలి బౌలర్‌గా నిలిచారు. తన లెగ్ స్పిన్, గూగ్లీ మిశ్రమ బౌలింగ్ తో ప్లేయర్లను దెబ్బకొట్టడంతో దిట్ట. అతను అడిన జట్లకు ఒంటిచేత్తో అనేక విజయాలు అందించారు.

36
2. భువనేశ్వర్ కుమార్

భారత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 190 మ్యాచ్‌లు ఆడి 198 వికెట్లు తీశారు. భువీ బౌలింగ్ సగటు 27.33. 

భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో 200 వికెట్లు పూర్తి చేయడానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కీలక బౌలర్‌గా నిలిచిన భువీ పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో తన నైపుణ్యాన్ని చూపించారు.

46
3. సునిల్ నరైన్

కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్నమూడో బౌలర్ గా కొనసాగుతున్నాడు. అతను 189 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీసి తన ప్రతిభను చూపించారు. ఆయన బౌలింగ్ సగటు 25.63. 

ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ అరుదైన రికార్డు సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో పాటు హ్యాట్రిక్ కూడా సాధించిన తొలి ఆటగాడిగా నిలిచారు.

56
4. పీయూష్ చావ్లా

భారత లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీశారు. ఆయన ఎకానమీ రేట్ 7.96. చావ్లా ఖాతాలో రెండు ఫోర్ వికెట్ హాల్స్ ఉన్నాయి. 

మిస్టరీ స్పిన్‌గా గుర్తింపు పొందిన అతని బౌలింగ్ తో ఐపీఎల్ లో విజయవంతమైన బౌలర్ గా నిలిచారు. ఐపీఎల్ లో పీయూష్ చావ్లా ఆడిన జట్లకు కీలక సమయంలో వికెట్లు తీసి అనేక విజయాలు అందించారు.

66
5. రవిచంద్రన్ అశ్విన్

భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 221 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు సాధించారు. ఆయన బౌలింగ్ సగటు 30.22, ఎకానమీ రేట్ 7.20గా ఉంది. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు.

అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడారు. ఐపీఎల్ లో తన ఆఫ్‌స్పిన్‌తో పాటు వ్యూహాత్మక బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Read more Photos on
click me!

Recommended Stories