దులీప్ ట్రోఫీ 2025 : షెడ్యూల్ వచ్చేసింది.. జట్లు, వేదిక, లైవ్ స్ట్రీమ్ వివరాలు మీకోసం

Published : Aug 25, 2025, 11:46 PM IST

Duleep Trophy 2025: భారత దేశవాళీ క్రికెట్ సీజన్ 2025–26 దులీప్ ట్రోఫీతో ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ సోమావారం దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈసారి జోనల్ ఫార్మాట్‌ లో నిర్వహిస్తున్నారు.

PREV
15
దులీప్ ట్రోఫీ 2025: టోర్నీ ఫార్మాట్, షెడ్యూల్

ఈ సంవత్సరం దులీప్ ట్రోఫీ తిరిగి సాంప్రదాయ జోనల్ ఫార్మాట్‌లోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం దులీప్ ట్రోఫీ 2025 షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం ఆరు జట్లు తమ తమ జోన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు ఉన్నాయి.

దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లలో నార్త్ జోన్ ఈస్ట్ జోన్‌తో, సెంట్రల్ జోన్ నార్త్ ఈస్ట్ జోన్‌తో తలపడతాయి. గత ఎడిషన్‌లో ఫైనలిస్టులుగా నిలిచిన సౌత్ జోన్, వెస్ట్ జోన్‌లకు నేరుగా సెమీ-ఫైనల్స్‌లో చోటు లభించింది. అన్ని మ్యాచ్‌లు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు జరుగుతుంది.

DID YOU KNOW ?
దులీప్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన జట్టు
దులీప్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టు వెస్ట్ జోన్. ఇప్పటివరకు 19 సార్లు విజేతగా నిలిచింది. ఆ తర్వాత నార్త్ జోన్ 18 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. సౌత్ జోన్ 14 సార్లు గెలిచి మూడో స్థానంలో ఉంది.
25
దులీప్ ట్రోపీ 2025 వేదిక, దాని ప్రాముఖ్యత

దులీప్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI’s Centre of Excellence)లో జరుగుతుంది. ఇది ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి అద్భుతమైన సదుపాయాలు అందిస్తుంది. ఈ పిచ్‌లు రెడ్-బాల్ క్రికెట్‌కు అనుకూలంగా రెడీ చేశారు. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. రాబోయే ముఖ్యమైన టెస్ట్ సిరీస్‌లకు ముందు భారత ప్లేయర్లకు ఈ టోర్నీ కీలకమైంది.

35
దులీప్ ట్రోఫీ 2025 షెడ్యూల్

దులీప్ ట్రోఫీ 2025 క్వార్టర్-ఫైనల్స్

• ఆగస్టు 28-31: నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్

• ఆగస్టు 28-31: సెంట్రల్ జోన్ vs నార్త్ ఈస్ట్ జోన్

దులీప్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్

• సెప్టెంబర్ 4-7: సౌత్ జోన్ vs క్వార్టర్-ఫైనల్ 1 విజేత

• సెప్టెంబర్ 4-7: వెస్ట్ జోన్ vs క్వార్టర్-ఫైనల్ 2 విజేత

దులీప్ ట్రోఫీ 2025 ఫైనల్

• సెప్టెంబర్ 11-15: సెమీ-ఫైనల్ 1 విజేత vs సెమీ-ఫైనల్ 2 విజేత

45
దులీప్ ట్రోఫీ 2025 జట్లు

సెంట్రల్ జోన్: ధ్రువ్ జురెల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రజత్ పాటిదార్, ఆర్యన్ జుయాల్, డానిష్ మలేవార్, సంచిత్ దేశాయ్, కుల్దీప్ యాదవ్, ఆదిత్య ఠాక్రే, దీపక్ చాహర్, సరంష్ జైన్, ఆయుష్ పాండే, శుభమ్ శర్మ, యష్ రాథోడ్, హర్ష్ దూబే, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్.

ఈస్ట్ జోన్: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్-కెప్టెన్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీదామ్ పాల్, శరన్దీప్ సింగ్, కుమార్ కుషాగ్ర, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, మహమ్మద్ షమీ.

నార్త్ ఈస్ట్ జోన్: రోంగ్‌సెన్ జొనాథన్ (కెప్టెన్), అంకుర్ మాలిక్, జెహు ఆండర్సన్, ఆర్యన్ బోరా, తెచి డోరియా, ఆశీష్ థాపా, సెదెఝాలి రూపెరో, కర్ణజిత్ యుమ్నమ్, హేమ్ చెత్రి, పాల్జోర్ తమంగ్, అర్పిత సుభాష్ భతేవార (వికెట్ కీపర్), ఆకాష్ చౌదరి, బిష్వోర్‌జిత్ కొంథౌజమ్, ఫైరోయిజమ్ జోతిన్, అజయ్ లమబమ్ సింగ్.

55
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ

నార్త్ జోన్: శుభ్ మన్ గిల్ (కెప్టెన్), శుభమ్ ఖజూరియా, అంకిత్ కుమార్ (వైస్-కెప్టెన్), ఆయుష్ బదోని, యష్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ డాగర్, యుధ్వీర్ సింగ్ చారక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అంషుల్ కాంబోజ్, ఆకిబ్ నబి, కన్హయ్య వధవాన్ (వికెట్ కీపర్).

సౌత్ జోన్: తిలక్ వర్మ (కెప్టెన్), మహమ్మద్ అజహరుద్దీన్ (వైస్-కెప్టెన్, వికెట్ కీపర్), తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), టి విజయ్, ఆర్ సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైషాక్ విజయ్‌కుమార్, ఎండి నిధీష్, రికీ భుయ్, బాసిల్, గుర్జప్‌నీత్ సింగ్, స్నేహల్ కౌతంకర్.

వెస్ట్ జోన్: శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జయమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కొటియన్, ధర్మేంద్రసింగ్ జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జన్ నాగ్వాస్వాలా.

దులీప్ ట్రోఫీ 2025 లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు?

దులీప్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లను జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories