Chinnaswamy Stadium : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం భద్రతా లోపాల కారణంగా పెద్ద ఈవెంట్లకు సురక్షితమైనది కాదని జాన్ మైఖేల్ కున్హా కమిషన్ నివేదిక పేర్కొంది. దీంతో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మహిళల ప్రపంచకప్ 2025కు ముందు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం భద్రతా సమస్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా కమిషన్ తన నివేదికలో షాకింగ్ విషయాలు పేర్కొంది.
పెద్ద ఎత్తున జన సమూహంతో ఉండే ఈవెంట్లకు బెంగళూరు స్టేడియం సురక్షితం కాదని పేర్కొంది. ఈ నివేదిక మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణపై అనుమానాలను పెంచుతోంది.
DID YOU KNOW ?
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం
బెంగళూరు చినాస్వామి స్టేడియం 1970లో పూర్తి కాగా, 1972లో తొలి మ్యాచ్, 1974లో తొలి టెస్టు, 1982లో తొలి వన్డేను ఆడారు.
25
బెంగళూరు తొక్కిసలాటతో విచారణ కమిషన్ ఏర్పాటు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కున్హా కమిషన్.. ఎం. చిన్నస్వామి స్టేడియానికి పెద్ద ఈవెంట్ల నిర్వహణకు తగిన మౌలిక సదుపాయాలు లేవని తేల్చింది.
నివేదికలో స్టేడియం బహిరంగ రహదారుల నుండి వేరు చేసిన క్యూలైన్లు, లోపలికి, బయటకు రావడానికి ఏర్పాటు చేసిన ద్వారాలు పెద్ద ఈవెంట్లకు సరిపడే విధంగా లేవు. సమగ్ర అత్యవసర తరలింపు ప్రణాళికలు, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు సరిపడే పార్కింగ్, ప్రజా రవాణా అనుసంధానం వంటి అవసరాలు స్టేడియంలో లేవని కున్హా కమిషన్ నివేదిక పేర్కొంది.
35
మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం
ఎం. చినాస్వామి స్టేడియంలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ లు జరగనున్నాయి. సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు వేదికగా ఎంపికైంది. భారత్-శ్రీలంక ఓపెనింగ్ మ్యాచ్, సెమీఫైనల్, ఫైనల్‌ను ఇక్కడ నిర్వహించాలనే ప్రణాళిక ఉంది. అయితే, తాజా నివేదికలతో ఈ మ్యాచ్‌లు ఇతర నగరాలకు మారే అవకాశం పెరిగింది.
బీసీసీఐ కూడా భద్రతా కారణాలతో వేదికను మార్చే దిశగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.
చిన్నస్వామి స్టేడియంలో రాబోయే మహారాజా టీ20 ట్రోఫీ, కర్ణాటక టీ20 దేశీయ టోర్నమెంట్ కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి. కానీ ఈ టోర్నమెంట్‌ను ప్రేక్షకుల లేకుండా నిర్వహించే అవకాశం ఉందని నివేదిక సూచిస్తోంది.
నివేదికలో స్టేడియంలో పెద్ద ఈవెంట్లు జరపడం ప్రజా భద్రత, పట్టణ రవాణా, అత్యవసర సేవల సిద్ధతపై ఆందోళనలను కున్హా కమిషన్ ప్రస్తావించింది.
55
బెంగళూరు తొక్కిసలాట బాధ్యులపై చర్యలకు సిఫార్సు
జాన్ మైఖేల్ కున్హా కమిషన్ బెంగళూరు తొక్కిసలాట బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు రఘురామ్ భట్, మాజీ కార్యదర్శి ఏ. శంకర్, మాజీ ఖజాంచి ఈఎస్ జైరామ్, ఆర్సీబీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ మేనన్, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ టి. వెంకట్ వర్ధన్, వైస్ ప్రెసిడెంట్ సునీల్ మాథూర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది. తొక్కిసలాట తర్వాత ఏ. శంకర్, ఈఎస్ జైరామ్ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు.