India vs England: చరిత్ర సృష్టించిన ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. రికార్డుల మోత ఇది !

Published : Aug 12, 2025, 04:01 PM IST

India England Test Series: ఇండియా-ఇంగ్లాండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్ రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. డిజిటల్ వ్యూస్, రన్స్, వికెట్ల పరంగా అనేక రికార్డులు సాధించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త చరిత్ర

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్ట్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అద్భుతమైన ప్రజాదరణను సాధించింది. 

మొత్తం 65 బిలియన్ నిమిషాల వీక్షణ సమయంతో, జియో హాట్‌స్టార్‌లో 17 కోట్ల వ్యూస్ సాధించడం విశేషం. ఓవల్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 1.3 కోట్ల ప్రత్యక్ష వీక్షణలు నమోదవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.

DID YOU KNOW ?
టెస్ట్ కెప్టెన్‌గా గిల్ రికార్డులు
టెస్ట్ కెప్టెన్‌గా మొదటి సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు బాదిన ఏకైక భారత ఆటగాడు శుభ్ మన్ గిల్. ఈ సిరీస్‌లో మొత్తం 754 పరుగులు సాధించి సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
25
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఉత్కంఠభరిత ఫలితాలు

ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది. మూడో టెస్ట్‌లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

నాలుగో టెస్ట్‌ జడేజా, సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో డ్రాగా ముగిసింది. ఐదో టెస్ట్‌ చివరి రోజు సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసి భారత్ సిరీస్‌ను సమం చేసింది.

35
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు

ఐదో టెస్టులో చివరి రోజున ఇంగ్లాండ్‌కు 35 పరుగులు కావాలి, నాలుగు వికెట్లు మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో సిరాజ్ తన వేగం, కచ్చితత్వంతో కూడిన సూపర్ బౌలింగ్ తో భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో అతను మొత్తం 23 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

45
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో 96 ఏళ్ల రికార్డు సమం

ఈ సిరీస్‌లో మొత్తం 14 సార్లు 300+ స్కోర్లు నమోదు కావడం విశేషం. 1928-29 యాషెస్ సిరీస్ రికార్డును భారత్-ఇంగ్లాండ్ సిరీస్ సమం చేసింది. ఇంగ్లాండ్ పిచ్ లపై బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొట్టారు. 

సెంచరీల మోత మోగించారు. అయితే, బౌలర్లు మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు. మొదటి టెస్ట్‌లోనే నాలుగు ఇన్నింగ్స్‌లలో 300 ప్లస్ స్కోర్లు రావడం ఈ సిరీస్ ఉత్కంఠను మరింత పెంచింది.

55
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో బ్యాటింగ్ రికార్డులు

శుభ్‌మన్ గిల్  కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు, మొత్తం 754 పరుగులు చేశాడు. ఒకే సిరీస్‌లో ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు 500+ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. అలాగే, భారత జట్టు అత్యధిక పరుగులు చేసిన సిరీస్ గా నిలిచింది. మొత్తంగా రెండో సిరీస్ గా ఘనత సాధించింది.

Read more Photos on
click me!

Recommended Stories