Dewald Brevis: సిక్సర్ల వర్షం.. సునామీ బ్యాటింగ్ తో డెవాల్డ్ బ్రెవిస్ సూపర్ సెంచరీ

Published : Aug 12, 2025, 04:47 PM IST

Dewald Brevis: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పరుగుల వర్షం కురిపించాడు. 41 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అనేక రికార్డులు బద్దలు కొట్టాడు.

PREV
15
డార్విన్‌లో డెవాల్డ్ బ్రెవిస్ దూకుడు

డార్విన్‌లోని మరారా క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ తన మొదటి అంతర్జాతీయ టీ20 సెంచరీని సాధించాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రెవిస్, 41 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన సెంచరీ నాక్ లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో పరుగుల సునామీ రేపాడు.

DID YOU KNOW ?
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఏబీ డివిలియర్స్
వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. 2015 జనవరి 18న జోహానెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లో సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్సులతో 149 పరుగులు కొట్టాడు.
25
దక్షిణాఫ్రికా చరిత్రలో డెవాల్ట్ బ్రెవిస్ ప్రత్యేక రికార్డులు

ఆస్ట్రేలియాపై టీ20లో సెంచరీ సాధించిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా బ్రెవిస్ చరిత్రలో నిలిచాడు. అంతకుముందు రికార్డు హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. 2016 మార్చి 9న కేప్‌టౌన్‌లో ఆమ్లా 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బ్రెవిస్ ఆ రికార్డును అధిగమించడంతో పాటు ఆస్ట్రేలియాపై టీ20లో ఐదుకు పైగా సిక్సులు బాదిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.

35
అత్యంత పిన్న వయసులో సెంచరీ కొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్

22 ఏళ్ల వయసులో బ్రెవిస్ టీ20ల్లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా అత్యంత పిన్న ఆటగాడు అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్‌గా ఐపీఎల్‌లో గుర్తింపు పొందిన బ్రెవిస్.. ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లోనే హాహ్ సెంచరీ కొట్టాడు. ఇది ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా తరఫున అత్యంత వేగంగా వచ్చిన 50 పరుగులు కావడం విశేషం.

ఈ మ్యాచ్ లో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన బ్యాటింగ్ తో 125 పరుగుల నాక్ ఆడాడు. తన సెంచరీ నాక్ లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అతని సునామీ ఇన్నింగ్స్ తో  సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

45
దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా T20I మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

డెవాల్డ్ బ్రెవిస్: డార్విన్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచి అగ్రస్థానంలో ఉన్నాడు.

హషీమ్ ఆమ్లా: 2016లో కేప్ టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున 62 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.

డామియన్ మార్టిన్: 2006లో బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున 56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు.

మిచెల్ మార్ష్: 2023లో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున 49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ట్రావిస్ హెడ్: 2023లో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 91 పరుగులు చేశాడు.

55
సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా సిరీస్

మూడుమ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ 52 బంతుల్లో 83 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అయ్యాడు. కామెరూన్ గ్రీన్ 13 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా పేసర్ క్వానా మాఫాకా నాలుగు వికెట్లు తీసి రాణించాడు.

Read more Photos on
click me!

Recommended Stories