వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి 20 మందితో షార్ట్ లిస్ట్... బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటన...

First Published Jan 3, 2023, 12:04 PM IST

ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతూ వస్తోంది టీమిండియా. టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగిన గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ టీమిండియాకి నిరాశే ఎదురైంది. అయితే స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ టీమిండియానే ఫెవరెట్...

Image credit: Getty

2023 అక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం 20 మందితో కూడిన జట్టును షార్ట్ లిస్ట్ చేసినట్టు ప్రకటించింది బీసీసీఐ. వీరిలో 15 మంది వరల్డ్ కప్‌కి ఎంపికవుతారు...

‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ది బెస్ట్ అనుకుంటున్న 20 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్  చేశాం. వీళ్లు వచ్చే వరల్డ్ కప్ వరకూ రొటేషన్ పద్దతిలో అన్ని సిరీసుల్లో ఆడతారు... వారి పర్ఫామెన్స్‌ని బట్టి వరల్డ్ కప్ ఆడే 15 మంది టీమ్‌ని డిసైడ్ చేస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

Image credit: PTI

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌లకు బ్యాటర్లుగా వన్డే వరల్డ్ కప్‌‌‌ షార్ట్ లిస్టులో చోటు దక్కే అవకాశం ఉంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందని భావించినా, అతన్ని రేసు నుంచి తప్పించింది బీసీసీఐ..

Image credit: PTI

హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆల్‌రౌండర్లుగా చోటు దక్కొచ్చు. లక్కీగా గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన రవిచంద్రన్ అశ్విన్‌కి వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశం రాకపోవచ్చు...

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్‌లకు వికెట్ కీపింగ్ బ్యాటర్లుగా వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే 20 మంది జాబితాలో అవకాశం దక్కొచ్చు. రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టినా వన్డే వరల్డ్ కప్‌ సమయానికి ఫామ్ అందుకోవడానికి అతనికి 3 నెలల సమయం ఉంటుంది...

Jasprit Bumrah

ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌తో పాటు యంగ్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు 20 మంది జాబితాలో చోటు దక్కడం ఖాయం. వీరితో పాటు స్పిన్నర్లుగా యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కొచ్చు...

Image credit: Getty

గాయం కారణంగా వరుసగా సిరీస్‌లకు దూరమవుతున్న ఆల్‌రౌండర్ దీపక్ చాహార్, పూర్తి ఫిట్‌నెస్ సాధించి టీమిండియా తరుపున బ్రేకులు లేకుండా మ్యాచులు ఆడగలిగితే... రేసులోకి అతను కూడా వచ్చే అవకాశం ఉంది...

Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి 20 మందితో కూడిన భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

click me!