ఎండాకాలం పాలు తొందరగా విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

First Published | Apr 25, 2024, 3:57 PM IST

ఒక్కరోజు పొరపాటున మర్చిపోయామా ఇక అంతే... సాయంత్రానికి మొత్తం విరిగిపోతాయి.  పెరుగులాగా కూడా మారిపోతూ ఉంటాయి.  సమ్మర్ లో  చాలా మంది ఇంట్లో కామన్ గా జరిగేదే ఇది. 

milk

ఎండాకాలం అధిక ఎండ, వేడి కారణంగా పాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి.  పాలు తెచ్చిన వెంటనే కాచి.. ఆరిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాం. ఒక్కరోజు పొరపాటున మర్చిపోయామా ఇక అంతే... సాయంత్రానికి మొత్తం విరిగిపోతాయి.  పెరుగులాగా కూడా మారిపోతూ ఉంటాయి.  సమ్మర్ లో  చాలా మంది ఇంట్లో కామన్ గా జరిగేదే ఇది. అయితే.. మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. పాలు విరిగిపోకుండా మంచిగా ఉండేలా  చేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

ఎండాకాలం పాలు విరిగిపోతే చాలా మంది పారబోస్తూ ఉంటారు. కొందరు స్వీట్ లేదంటే.. పన్నీర్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ.. అసలు పాలే విరగకుండా జాగ్రత్తపడవచ్చని నిపుణులు అంటున్నారు.
 


Milk

వేసవిలో పాలు చెడిపోకుండా ఉండాలంటే ముందుగా పాలను బాగా వేడి చేసి పూర్తిగా చల్లార్చాలి. అది చల్లారిన తర్వాత, గాజు పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల పాలు పాడవవు.

అదేవిధంగా వేసవిలో పాలను నిల్వ చేసేందుకు ప్లాస్టిక్ డబ్బాలను వాడుకోవచ్చు. ఇందుకోసం పాలను వేడి చేసి చల్లార్చి ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు మూడు నాలుగు రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి.

milk

వేసవిలో పాలు పాడవకుండా నిల్వ ఉంచేందుకు స్టీలు పాత్రలను ఉపయోగించవచ్చు. పాలను నిల్వ ఉంచే ముందు పాత్రను శుభ్రంగా కడిగి.. లేదో చూసుకోవాలి. మరి అందులో పాలు నిల్వ ఉంచితే పాల రుచి మారదు.
 

milk

మీ ఇంట్లో బ్రిడ్జి లేకపోతే రోజుకు నాలుగు సార్లు పాలు వేడి చేయాలి.  పాలు మరిగేటప్పుడు మంటను తగ్గించండి. ముఖ్యంగా పాలు మరిగిన వెంటనే మూత పెట్టకూడదు. అలాగే, గిన్నెను అంచు వరకు పాలతో నింపవద్దు.
 


పాల ప్యాకెట్‌ను దుకాణం నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే పాలు కాగపెట్టకూడదు. ఆ పాలల్లో కొద్దిగా ... నీరు కలపండి. తర్వాత ఇనుప పాత్రలో వేసి మరిగించాలి.
 

Latest Videos

click me!