గిల్ vs సూర్య‌: ఆసియా కప్ 2025లో టీమిండియా కెప్టెన్ ఎవ‌రు?

Published : Aug 15, 2025, 04:47 PM IST

Asia Cup 2025: ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో అద‌ర‌గొట్టిన శుభ్ మ‌న్ గిల్ కు మిగ‌త ఫార్మాట్ల కెప్టెన్సీ కూడా ఇవ్వాల‌నే చ‌ర్చ మొద‌లైంది. దీంతో రాబోయే ఆసియా క‌ప్ 2025లో భార‌త జ‌ట్టుకు కెప్టెన్ గా సూర్య కుమార్ ఉంటారా? లేదా? అనే చ‌ర్చ సాగుతోంది.

PREV
15
భార‌త జ‌ట్టు కెప్టెన్సీపై నెలలుగా చర్చలు

ఆసియా కప్ 2025లో భారత టీ20 జట్టు కెప్టెన్ ఎవరు అవుతారనే ప్రశ్నకు చివరికి సమాధానం లభించింది. ఇప్పటివరకు అనేక ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు టీ20 కెప్టెన్సీ కూడా ఇవ్వొచ్చని వార్తలు వచ్చాయి. సూర్య కుమార్ యాద‌వ్ ను త‌ప్పించే అవ‌కాశాలపై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఈ విష‌యంపై స్ప‌ష్ట‌తను ఇచ్చింది.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో భారత్ రికార్డులు
ఇప్ప‌టివ‌ర‌కు 16 ఆసియా క‌ప్ టోర్నీలు జ‌రిగాయి. అత్య‌ధికంగా భార‌త్ 8 సార్లు టైటిల్ గెలుచుకుంది.
25
ఆసియా క‌ప్ 2025 లో భార‌త జ‌ట్టు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్

ఈ వారం ప్రారంభంలో గిల్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించొచ్చని కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అయితే, రాబోయే ఆసియా క‌ప్ 2025లో భార‌త జ‌ట్టును సూర్య‌కుమార్ యాద‌వ్ న‌డిపిస్తార‌నే స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

తాజా రిపోర్టుల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్‌ను మార్చే ఆలోచన సెలక్షన్ కమిటీకి లేదు. 34 ఏళ్ల సూర్య ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హర్నియా శస్త్రచికిత్స అనంతరం రిహ్యాబ్‌లో ఉన్నారు. ఆగస్టు 19న ముంబైలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశానికి కూడా హాజరుకానున్నారు.

35
భార‌త సెలక్షన్ మీటింగ్ కీలకం కానుంది

ఆగస్టు 19న ముంబైలో భారత జట్టు ఎంపిక జరుగుతుంది. అదే రోజున చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించి జట్టును ప్రకటిస్తారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఏఈలోని దుబాయ్, అబుదాబీలలో ఆసియా కప్ 2025 జరగనుంది. సూర్య మీటింగ్‌కు హాజరవడం, ఆయన కెప్టెన్సీ కొనసాగింపుకు స్పష్టమైన సంకేతంగా పరిగణిస్తున్నారు.

45
భార‌త జ‌ట్టులో ప‌లువురు స్టార్ ప్లేయర్స్ ఔట్

ఆసియా క‌ప్ 2025 భార‌త జ‌ట్టులో ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు చోటుద‌క్క‌ద‌ని క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. టెస్ట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ జట్టులో ఉండరని తెలుస్తోంది. జైస్వాల్‌ను రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టమని సెలెక్టర్లు సూచించారు. 

టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక ప్రకారం, ఈ టోర్నీలో సంజూ శాంస‌న్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీగా ఆడే అవకాశం ఉంది. గిల్ ప్రస్తుతం టీ20 స్క్వాడ్‌లో స్థానం కోసం పోరాడుతున్న స్థితిలో ఉన్నారు. అయితే, ప్ర‌స్తుతం సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు కాబ‌ట్టి చోటుద‌క్కించుకోవ‌డం ప‌క్కాగానే క‌నిపిస్తోంది.

55
టైటిల్ ఫేవ‌రెట్ గా ఆసియా క‌ప్ 2025 లో అడుగుపెడుతున్న భార‌త్

ఆసియా క‌ప్ 2025 లో భార‌త్ టైటిల్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతోంది. ఈ టోర్నీకి ముందు టీమిండియా ఎంపిక చుట్టూ హాట్ టాపిక్ కొనసాగుతోంది. కెప్టెన్సీతో పాటు జట్టు కాంబినేషన్‌పై కూడా సెలక్షన్ కమిటీ నిర్ణయాలు కీలకం కానున్నాయి.

సూర్య కుమార్ యాద‌వ్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగొస్తే, భారత జట్టు అనుభవజ్ఞుడైన, అటాకింగ్ కెప్టెన్ నేతృత్వంలో టోర్నీలో అడుగుపెట్టనుంది. మరోవైపు, గిల్ తన టెస్ట్ కెప్టెన్సీ ద్వారా ప్రతిభను కొనసాగిస్తారని అంచనాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories