Rohit Sharma: రిటైర్మెంట్ అన్న‌ది ఎవ‌డ్రా.. వ‌న్డే ప్ర‌పంచ కప్ కోసం శిక్ష‌ణ మొద‌లుపెట్టిన రోహిత్ శ‌ర్మ

Published : Aug 13, 2025, 02:50 PM IST

Rohit Sharma: టీమిండియా స్టార్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ వ‌న్డే రిటైర్మెంట్ వార్త‌ల‌ను పటా పంచల్ చేశాడు. రాబోయే వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2027 కోసం అభిషేక్ నాయర్ తో కలిసి శిక్షణను మొదలుపెట్టారు. 

PREV
15
2027 వ‌న్డే వరల్డ్ కప్ టార్గెట్ ను గురిపెట్టిన రోహిత్ శర్మ !

గ‌త కొంత కాలంగా సీనియ‌ర్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు వన్డే క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వన్డే ప్రపంచ కప్ 2027 భారత జట్టు వీరుండరనే చర్చ సాగింది. అయితే, రోహిత్ శ‌ర్మ వ‌న్డే రిటైర్మెంట్ వార్త‌ల‌ను పటా పంచల్ చేశాడు. 2027 వ‌న్డే వరల్డ్ కప్ కోసం ఫిట్‌నెస్ పై దృష్టి సారించారు.

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత, రోహిత్ మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన స్థానం దక్కించుకునేందుకు శిక్షణ మొదలెట్టారు. మాస్టర్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ.. వన్డేల్లో ఇప్పటివరకు 32 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత మూడవ స్థానంలో ఉన్నారు. అలాగే, ప్రస్తుత వన్డే ర్యాకింగ్స్ లో రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతుండటం విశేషం.

DID YOU KNOW ?
వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ ఒకేఒక్కడు
వన్డే క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు కొట్టిన ప్లేయర్ రోహిత్ శర్మ. మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 రికార్డు కూడా రోహిత్ పేరిట ఉంది.
25
అభిషేక్ నాయర్ తో కలిసి శిక్షణ మొదలుపెట్టిన రోహిత్ శర్మ

రోహిత్ ముంబైలోని జిమ్‌లో తన స్నేహితుడు, బీసీసీఐ మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి శిక్షణ ప్రారంభించారు. నాయర్ కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, రింకూ సింగ్ వంటి పలువురు టాప్ ప్లేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన కోచ్. 

తాజాగా రోహిత్ తన శిక్షణకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాను రిటైర్మెంట్ కావడం లేదనీ, రాబోయే వన్డే ప్రపంచ కప్ భారత జట్టు రేసులో ఉన్నానని పరోక్షంగా సూచనలు పంపాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

35
రోహిత్ వన్డే కెప్టెన్సీ, భవిష్యత్తుపై ప్రశ్నలు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ వంటి సీనియర్లు లేని యంగ్ ఇండియా గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ లో అదరగొట్టింది. కెప్టెన్ గా గిల్ సైతం అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. దీంతో వన్డే కెప్టెన్సీ కూడా అతనికి ఇవ్వాలనే చర్చలు మొదలయ్యాయి.

వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్ ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదా గిల్ కు అప్పగిస్తారా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ శ‌ర్మ త‌న కెప్టెన్సీని వ‌దులుకునే అవ‌కాశ‌ముందనీ, అత‌నికి ఫేర్‌వెల్ సిరీస్ ఇవ్వడం అవసరమ‌ని బీసీసీఐ భావిస్తోంద‌ని కూడా క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ నడుస్తోంది.

45
రోహిత్ శ‌ర్మ వ‌న్డే కెరీర్ రికార్డులు

హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శ‌ర్మ‌.. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య‌వంత‌మైన కెరీర్ ను కొన‌సాగించారు. అద్భుత‌మైన బ్యాటింగ్ తో వ‌న్డే క్రికెట్ లో రికార్డుల మోత మోగించారు. రోహిత్ శ‌ర్మ‌ 273 వ‌న్డే మ్యాచ్‌లలో 11,168 పరుగులు సాధించారు. 48.76 స‌గ‌టుతో బ్యాటింగ్ ను కొన‌సాగించాడు. వ‌న్డేల్లో ఏకంగా 3 డబుల్ సెంచరీలు బాదాడు. వ‌న్డే క్రికెట్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 264 ప‌రుగుల రికార్డును రోహిత్ శ‌ర్మ సాధించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజీలాండ్ పై విజయంలో కీల‌క పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

55
టీ20, టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన రోహిత్ శ‌ర్మ

రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే టెస్ట్, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్ర‌స్తుతం 50 ఓవర్ ఫార్మాట్ పై పూర్తి దృష్టి సారించారు. 26 నెలల తరువాత జరగనున్న 2027 వ‌న్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ శిక్షణ తీసుకుంటూ ఫిట్‌నెస్, ఫామ్ పై దృష్టి పెట్టారు. 

దీంతో జట్టు మేనేజ్మెంట్, బీసీసీఐ నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ భార‌త వ‌న్డే జ‌ట్టును న‌డిపించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. జ‌ట్టులో తన ప్రధాన పాత్ర కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది.

Read more Photos on
click me!

Recommended Stories