India Cricket: కోహ్లీ, రోహిత్ లు రిటైర్మెంట్ తో త‌ప్పు చేశారా? మాజీ ప్లేయ‌ర్ హాట్ కామెంట్స్

Published : Aug 13, 2025, 12:23 PM IST

India Cricket: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు టెస్టు క్రికెట్ తో పాటు టీ20 క్రికెట్ కు ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం వ‌న్డేల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. అయితే, వీరి రిటైర్మెంట్ పై ఆకాశ్ చోప్రా చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

PREV
16
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల్లో కొన‌సాగాల్సింది !

భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి త‌ప్పుచేశార‌ని మాజీ క్రికెటర్ అకాష్ చోప్రా అన్నారు. వీరిద్ద‌రూ టెస్టు ఫార్మాట్ కాకుండా వన్డే క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం త‌క్కువ‌గా వ‌న్డే మ్యాచ్ లు జ‌రుగుతుండ‌టం వ‌ల్ల వారు త‌మ‌ ఫిట్‌నెస్, ఫామ్ ను నిలబెట్టుకోవ‌డం కష్టమని పేర్కొన్నారు.

DID YOU KNOW ?
90 సెంచరీలు కొట్టిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ టెస్టుల్లో 30, వన్డేల్లో 51, టీ20ల్లో 1, ఐపీఎల్ లో 8 సెంచరీలు సాధించాడు. ఈ నాలుగు ఫార్మాట్ లలో కలిపి మొత్తం 90 సెంచరీలు బాదాడు.
26
విరాట్, రోహిత్ లు వ‌న్డేల‌కు కూడా గుడ్ బై చెబుతారా?

భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అలాగే, భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ గెలిచిన త‌ర్వాత పొట్టి ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. ప్రస్తుతం మీడియా నివేదికల ప్రకారం.. ఈ స్టార్ ప్లేయ‌ర్లు వన్డే క్రికెట్ నుంచి కూడా త్వరలోనే వీడ్కోలు చెప్ప‌బోతున్నార‌ని స‌మాచారం. 

సౌతాఫ్రికా, నమీబియా వేదిక‌లుగా 2027లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ భార‌త జ‌ట్టు ప్రాణాళిక‌ల్లో వీరు లేర‌నే చ‌ర్చ సాగుతోంది. వీరు తమ ఫిట్‌నెస్, ఫామ్ ను ప్రూవ్ చేయడానికి డొమెస్టిక్ 50 ఓవర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

36
తప్పు ఫార్మాట్‌ను వీడారు: ఆకాష్ చోప్రా

ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. “వీరు తప్పు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. టీ20 ప్రపంచకప్ గెలిచాక టీ20లు వదిలేశారు. కానీ టెస్టులు ఆడుతూ వ‌న్డేలు వదిలి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. 12 నెలల్లో భారతదేశం ఆడిన వ‌న్డేలు ఆరు మాత్రమే” అని చెప్పారు.

ఒక ఏడాది‌లో ఆరు టెస్టులు ఆడితే, అది 30 రోజుల క్రికెట్. కానీ ఆరు వ‌న్డేలు ఆడితే కేవలం ఆరు రోజుల మ్యాచ్‌లు మాత్రమే. ఐపీఎల్ తరువాత నుంచి వచ్చే వ‌న్డేల వరకు 100 రోజులు దాటిపోతాయి అని పేర్కొన్నారు.

46
వ‌న్డే సిరీస్‌ల మధ్య గ్యాప్‌లు ఫిట్‌నెస్‌కు ముప్పు

ఆకాశ్ చోప్రా వివరించినట్లు.. మూడు మ్యాచ్‌ల సిరీస్ 7-8 రోజుల్లో పూర్తవుతుంది. మళ్లీ మూడు నెలల తరువాత సిరీస్ ఉంటుంది. ఇలాంటి విరామాలు పెద్దవిగా ఉండటంతో ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్, ఫామ్, డైట్ నియమాలను పాటించడం కష్టమవుతుంది.

“టెస్టులు ఆడితే ఆటగాళ్లకు నిరంతరం పోటీ స్థాయిలో ఉండటం సులభం, కానీ ఇప్పుడు వ‌న్డేలు తక్కువగా ఉన్నందున ఆటగాళ్లు మైదానంలో రిఫ్లెక్స్ కూడా కోల్పోతున్నారు” అని చోప్రా చెప్పారు. 

56
విరాట్, రోహిత్ వన్డేల రికార్డులు

విరాట్ కోహ్లీ 302 వ‌న్డే మ్యాచ్ ల‌ను ఆడి 14,181 పరుగులు సాధించాడు. అత‌ని బ్యాటింగ్ స‌గ‌టు 57.88గా ఉంది. 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. కోహ్లీ అత్యధిక వ్య‌క్తిగ‌త‌ స్కోరు 183 ప‌రుగులు. రోహిత్ శర్మ 272 మ్యాచ్‌లలో 11,168 పరుగులు సాధించాడు. 48.76 సగటుతో 32 సెంచరీలు, 59 హాఫ్ సెంచ‌రీలు బాదాడు. హిట్ మ్యాన్ అత్యధిక వ్య‌క్తిగ‌త‌ స్కోరు 264 ప‌రుగులు.

2023 నుండి 2024 వరకూ మంచి ఫామ్ లో ఉన్నారు. విరాట్ 37 మ్యాచ్‌లలో 1,710 పరుగులు, రోహిత్ 38 మ్యాచ్‌లలో 1,714 పరుగులు సాధించారు.

66
రాబోయే వ‌న్డే సిరీస్ లు ఆడ‌నున్న కోహ్లీ, రోహిత్

విరాట్, రోహిత్ లు రాబోయే సిరీస్ లో అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాతో వ‌న్డే మ్యాచ్ ల‌లో ఆడ‌నున్నారు. నవంబర్ నుండి డిసెంబర్ వరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మూడు వన్డేలు, జనవరిలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, జూలైలో ఇంగ్లాండ్‌లో మూడు వన్డేల సిరీస్ లో ఆడ‌నున్నారు.

ఆకాష్ చోప్రా అభిప్రాయం ప్రకారం.. రోహిత్, కోహ్లీలు టెస్టులు వదిలి వ‌న్డేలు మాత్రమే ఆడటం అంత మంచి నిర్ణయం కాదు. అంతేకాకుండా, డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకపోవటం కూడా వారి ఫిట్‌నెస్‌ను ప్రభావితం చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories