
Sourav Ganguly - Nagma relationship: క్రికెట్ ఆటగాళ్లు, సినీ తారల మధ్య ప్రేమాయణాలు కొత్త కాదు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ లాంటి జంటలు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే, 2000ల ప్రారంభంలో మరో హాట్ టాపిక్ అయిన జంట సౌరవ్ గంగూలీ - నగ్మా. ఇప్పుడు మళ్లీ ఈ బంధం పై చర్చ జరుగుతోంది. అందుకు కారణం నటి నగ్మా ఇచ్చిన ఇంటర్వ్యూ చేసిన కామెంట్స్, అలాగే దాదా బర్తే డే.
సుమారు 25 ఏళ్ల క్రితం, అంటే 1999లో మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నటి నగ్మా ప్రేమలో ఉన్నారనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి.
1997లో గంగూలీ తన స్నేహితురాలు డోనాను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి జరిగిన రెండేళ్లకు అంటే 1999 నాటికి గంగూలీ నగ్మాతో ప్రేమాయణం నడిపారనే వార్తలు వచ్చాయి. ఇద్దరూ దేవాలయాల్లో కలిసి కనిపించారన్న వార్తలతో పాటు, రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా అప్పట్లో బాగా చక్కర్లు కొట్టాయి.
కానీ, వీరి బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఏం జరిగిందనే విషయంపై చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఈ స్టార్స్ దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
ఈ పుకార్ల నేపథ్యంగా నగ్మా ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గంగూలీ పేరును నేరుగా చెప్పకపోయినా, ఆమె మాట్లాడిన విషయాలు చర్చనీయాంశమయ్యాయి.
“ఒక విషయంలో హాట్ టాపిక్ అయినప్పుడు ఇద్దరూ ఏమీ మాట్లాడకపోతే.. ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అలాంటిదే జరుగుతోంది” అని ఆమె అన్నారు.
“మా మధ్య ఏం జరిగిందని మీరు ఊహిస్తున్నారు? నాకు క్రికెట్‌పై ఆసక్తి లేకపోవడం వల్ల చాలా విషయాలు తప్పుగా మలుపు తిరిగాయి. కొన్ని విషయాలు వర్కవుట్ కాలేదు, అందుకే మేము మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాం” అని చెప్పారు.
దాదా పేరు చెప్పకపోయినా.. అప్పటి పుకార్ల మధ్య చేసిన కామెంట్స్ తో అది గంగూలీతోనే అనీ, వారి సంబంధం ఎందుకు ముగిసిందన్న విషయాన్ని ఈ ప్రకటనతో నగ్మ స్పష్టంగా చెప్పారని అభిప్రాయపడుతున్నారు.
గంగూలీ, నగ్మ ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారిన సమయంలో గంగూలీ భార్య డోనాతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు కూడా ప్రముఖ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కానీ అది నిజం కాలేదు. గంగూలీ, డోనా దంపతులు ఇంకా కలిసి జీవిస్తున్నారు. కానీ గంగూలీ-నగ్మా బంధం మాత్రం పుకార్లుగానే మిగిలిపోయింది.
1990లలో సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో స్టార్ గా వెలుగొందిన నగ్మా.. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. 2008 తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
నగ్మా వయస్సు ప్రస్తుతం 49 ఏళ్లు. ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అప్పుడప్పుడూ మీడియాలో చర్చ వస్తూనే ఉంటుంది. 2020లో గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ఆమె ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్ ఇప్పటికీ డిలీట్ చేయలేదు.. ఇది ఆ బంధం లో మరక మిగిలిందనే సూచనగా కొందరు భావిస్తున్నారు.
ఈ ప్రేమ కథలో హ్యాపీ ఎండింగ్ లేకపోయినా, భారత క్రికెట్ చరిత్రలో, సినీ ప్రపంచంలో మరిచిపోలేని సంచలనంగా మిగిలిపోయింది.
నగ్మా తన ఇంటర్వ్యూలో మళ్లీ ఆ పేజిని తిప్పడంతో, ఈ బంధం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆమె స్పష్టంగా “వర్కవుట్ కాలేదు” అని చెప్పడం, ఈ బంధం ఒకచోట ఆగిపోయిందని తెలిపింది.
సినిమా, క్రికెట్ అభిమానులకు ఈ కథ గుడ్ న్యూస్ లా మారకపోయినా.. వారి బంధంలో ఎంతో బాధను కూడా భరించారనే చర్చ కూడా సాగింది. ప్రస్తుతం గంగూలీ పుట్టిన రోజు నేపథ్యంలో మరోసారి నగ్మతో సంబంధం వైరగ్ గా మారింది.