AB De Villiers Reacts To Shreyas Iyer: ఆసియా కప్ 2025 భారత టీమ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెట్ కాకుండా వేరే కారణం ఏదైనా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆసియా కప్ 2025 భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు దక్కని చోటు
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు చోటుదక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎక్స్ లో డివిలియర్స్ స్పందిస్తూ.. అయ్యర్‌ను తప్పించడం అతని క్రికెట్ ప్రదర్శన కంటే వేరే కారణాలతో జరిగి ఉండవచ్చని వ్యాఖ్యానించారు.
DID YOU KNOW ?
శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2025
ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్, ప్లేయర్ గా రాణించాడు. 604 పరుగులు సాధించాడు. 50.33 సగటు, 175.07 స్ట్రైక్ రేట్ తో అతని బ్యాటింగ్ కొనసాగింది. అత్యధిక స్కోరు: 97* (నాటౌట్). 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు.
25
భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంపై ఏబీడీ ఆశ్చర్యం
ఏబీ డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ ను భారత జట్టు నుంచి తప్పించడం కఠిన నిర్ణయం. "ఈ జట్టులో శ్రేయస్‌కు ఎక్కడ స్థానం ఇస్తారనే విషయాలు నేను ఆలోచించాను. కానీ, గత కొన్నేళ్లుగా మంచి ఆటతీరు కనబరిచిన ఆటగాడిని ఇలా తప్పించడం అభిమానులకు నిరాశ కలిగించింది. నా జట్టులో ఉంటే శ్రేయాస్ ఖచ్చితంగా ఆడేవాడు. అతని ఆట కారణం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవడం కష్టం" అని ఆయన ఏబీడీ అన్నారు.
35
డ్రెస్సింగ్ రూమ్ ఫాక్టర్ పై ఏబీడీ కామెంట్స్
తన అనుభవాన్ని పంచుకుంటూ ఏబీడీ డివిలియర్స్.. "ఒక ఆటగాడి నైపుణ్యం మాత్రమే కాకుండా, అతను డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలా ఉంటాడు, ఇతర ఆటగాళ్లపై ప్రభావం ఎలా చూపుతాడు అనే అంశాలు కూడా ఎంపికలో కీలకం అవుతాయి. 50-50 పరిస్థితుల్లో, జట్టు వాతావరణాన్ని పాజిటివ్‌గా ఉంచగల ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇస్తారు. నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ, జట్టులో ఇప్పటికే చాలామంది లీడర్లు ఉన్నందువల్ల ఇది కూడా కారణంగా ఉండొచ్చు" అని అన్నారు.
18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దశాబ్దం తర్వాత ఫైనల్‌కు చేరింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఫైనల్ లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 2025 ఐపీఎల్ సీజన్ లో అయ్యర్ కూడా బ్యాటర్ గా, కెప్టెన్ గా అదరగొట్టాడు.
2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన శ్రేయాస్, 2020లో ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. పంజాబ్ కింగ్స్‌తో ఆడుతూ 13 ఏళ్ల తర్వాత ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో మెరుగైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు కానీ, ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో అయ్యర్ కు చోటుదక్కలేదు.