Highest ODI Team Scores: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్ సాధించిన టీమ్ గా ఇంగ్లాండ్ టాప్ లో ఉంది. మొత్తంగా వన్డే క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించి మొదటి ఐదు స్థానాలు ఆక్రమించిన టీమ్స్ మ్యాచ్ ల వివరాలు తెలుసుకుందాం.
Highest ODI Team Scores: వన్డే క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించిన మ్యాచ్ లు చాలానే ఉన్నాయి. ఆదివారం సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ధనాధన్ బ్యాటింగ్ తో 400+ పరుగులు చేసింది. ఆ టీమ్ లోని ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్ సెంచరీలు బాదారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 431/2 పరుగులు చేసింది.
ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అదరగొట్టడంతో సౌతాఫ్రికా కేవలం 155 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికాపై ఆసీస్ 276 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, వన్డే క్రికెట్ లో అత్యధిక జట్టు స్కోర్లను గమనిస్తే టాప్ లో ఇంగ్లాండ్ ఉంది. అత్యధిక పరుగులు చేసిన జట్ల టాప్ 5 మ్యాచ్ ల వివరాలు గమనిస్తే..
DID YOU KNOW ?
వన్డే క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టిన రోహిత్ శర్మ
నవంబర్ 13, 2014న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకపై రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ తో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును నెలకొల్పాడు. 264 పరుగుల ఇన్నింగ్స్ లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. మొత్తంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.
26
1. ఇంగ్లాండ్ vs నెదర్లాండ్స్ - 498/4
వన్డే క్రికెట్ లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ సాధించిన జట్టు ఇంగ్లాండ్. 2022 జూన్ 17న అంస్టెల్వీన్‌లో ఇంగ్లాండ్ జట్టు వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. నెదర్లాండ్స్‌పై 498/4తో రికార్డు సృష్టించింది. నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ భారీ ఇన్నింగ్స్ ఆడింది.
జోస్ బట్లర్ 162* (70 బంతులు) పరుగులు, డేవిడ్ మలన్ 125, ఫిల్ సాల్ట్ 122, లియామ్ లివింగ్ స్టోన్ 66* (22 బంతులు) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 232 పరుగుల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్ తరఫున స్కాట్ ఎడ్వర్డ్స్ 72* పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
36
2. ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా - 481/6
2018 జూన్ 19న నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్ 481/6 స్కోరు చేసింది. ఇది వన్డే క్రికెట్ లో రెండో అత్యధిక జట్టు స్కోర్ గా ఉంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.
అలెక్స్ హేల్స్ 147 (92 బంతులు) పరుగులు, జానీ బెయిర్‌స్టో 139, జేసన్ రాయ్ 82, ఇయాన్ మోర్గాన్ 67 (30 బంతులు) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా 239 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ 242 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ 51 పరుగులు చేశారు.
2016లో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్ పాకిస్తాన్‌పై 444/3 స్కోరు చేసింది. ప్రస్తుతం ఇది వన్డే క్రికెట్ లో మూడో అత్యధిక జట్టు స్కోరుగా ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. బౌలింగ్ లో కూడా రాణించడంతో పాకిస్తాన్ 275 పరుగులకే ఆలౌటైంది. అలెక్స్ హేల్స్ 171 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. పాకిస్తాన్ తరఫున మొహమ్మద్ ఆమిర్ 58 పరుగులు చేశాడు.
56
4. శ్రీలంక vs నెదర్లాండ్స్ - 443/9
వన్డే క్రికెట్ లో నాలుగో అత్యధిక స్కోరు శ్రీలంక సాధించింది. 2006 జూలై 4న అంస్టెల్వీన్‌లో శ్రీలంక 443/9 స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభం నుంచే దూకుడుగా భారీ ఇన్నింగ్స్ ఆడింది. నెదర్లాండ్స్ 248 పరుగులకు ఆలౌటైంది. సనత్ జయసూర్య 157 పరుగులు సెంచరీ నాక్ ఆడాడు. దిల్షాన్ 117 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నెదర్లాండ్స్ తరఫున టిమ్ డి లీడే 51 పరుగులు చేశాడు.
66
5. సౌతాఫ్రికా vs వెస్టిండీస్ - 439/2
2015 జనవరి 18న జొహానెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికా 439/2 స్కోరు చేసింది. ఇది ప్రస్తుతం వన్డే క్రికెట్ లో 5వ అత్యధిక జట్టు స్కోరు గా ఉంది. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా విండీస్ బౌలింగ్ ను దంచికొట్టింది.
భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 291/7 పరుగులకే పరిమితం అయింది. హషీమ్ ఆమ్లా 153* పరుగులు, ఏబీ డివిలియర్స్ 149, రిల్లీ రుస్సో 128 పరుగులు సూపర్ సెంచరీ నాక్ లు ఆడారు. వెస్టిండీస్ తరఫున రామ్‌డిన్ 57 పరుగులు చేశారు.