Rinku Singh: రింకు సింగ్ యూపీ T20 లీగ్‌లో 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఆసియా కప్ 2025 జట్టులో తన ఎంపికపై వచ్చిన విమర్శలకు తన బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు.
ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న యూపీ టీ20 లీగ్ లో టీమిండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. లక్నో వేదికగా జరిగిన గోరఖ్‌పూర్ లయన్స్ - మీరట్ మావరిక్స్ మ్యాచ్‌లో మీరట్ జట్టు కెప్టెన్‌గా రింకూ సింగ్ ఆడాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో సిక్సర్ల వర్షం కురిపించాడు.
కేవలం 45 బంతుల్లో సెంచరీ బాదాడు. తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇటీవల ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో రింకూ సింగ్ కు కూడా చోటుదక్కింది. అయితే, జట్టులోకి రింకూను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. తాజా సెంచరీతో అతను విమర్శలకు తగిన సమాధానం ఇచ్చాడు.
DID YOU KNOW ?
ఐపీఎల్ లో వరుస సిక్సర్లు బాదిన రింకూ సింగ్
2023లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమైనప్పుడు రింకూ సింగ్ వరుసగా 5 సిక్సులు కొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు.
25
45 బంతుల్లో సెంచరీ కొట్టిన రింకూ సింగ్
ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకూ సింగ్ ఇన్నింగ్స్ లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.
ఈ సూపర్ ఇన్నింగ్స్ తో మీరట్ జట్టు 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కాగా, గత ఎనిమిది టీ20 ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోవడం వల్ల ఆసియా కప్ 2025 భారత జట్టులోకి రింకూ సింగ్ ను ఎంపిక చేయడం పై ప్రశ్నలు వస్తున్న సమయంలో సెంచరీ రావడం విశేషం.
35
రింకూ - యువరాజ్ భాగస్వామ్యం
ముందుగా బ్యాటింగ్ చేసిన గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు 20 ఓవర్లలో 167/9 పరుగులు చేసింది. 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త మెరుగైన ఆటను కొనసాగిస్తూ 167 పరుగులు చేసింది.
లక్ష్యం చేధించడంలో మీరట్ జట్టు ఆరంభంలో కష్టాల్లో పడింది. త్వరగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ రింకూ సింగ్.. సాహబ్ యువరాజ్ తో కలిసి అద్భుత భాగస్వామ్యం అందించాడు. ఇద్దరూ కలిసి 65 బంతుల్లో 130 పరుగులు చేశారు. యువరాజ్ 22 బంతుల్లో 22 పరుగులు చేసి రింకూ కు సహకారం అందించాడు.
మీరట్ మావరిక్స్ జట్టు 18.5 ఓవర్లలో లక్ష్యం చేరుకుంది. రింకూ సింగ్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. సెంచరీతో అదరగొట్టిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
ఇటీవల ఆసియా కప్ జట్టులో చోటు దక్కిన రింకూ సింగ్ ఎంపికపై క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు విమర్శలు చేశారు. కానీ ఈ సెంచరీ ద్వారా ఆయన తన ఫామ్ తిరిగి అందుకున్నాడు. భారత జట్టులో తనకు చోటు ఇవ్వడం సరైన నిర్ణయమేనని ఈ ఇన్నింగ్స్ తో నిరూపించాడు.
55
ఆసియా కప్ 2025-భారత జట్టులో రింకూ
ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం ఇటీవల బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో రింకూ సింగ్ కు కూడా చోటుదక్కింది. అలాగే, శివం దూబే, హర్షిత్ రాణా లాంటి కొత్త పేర్లకు అవకాశం లభించింది.