Railway Jobs: పది పాసైతే చాలు మంచి జీతంలో ప్రభుత్వ ఉద్యోగాలు

Published : Nov 23, 2025, 03:01 PM IST

Railway Recruitment: పది పాసైతే చాలు మంచి వేతనంలో రైల్వేలో జాబ్స్ ఉన్నాయి. దక్షిణ తూర్పు రైల్వేలో 1,785 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 10వ తరగతి + ITI అర్హతతో డిసెంబర్ 17 వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

భారత దక్షిణ తూర్పు రైల్వే మరోసారి భారీ అప్రెంటిస్ నియామక ప్రకటనను విడుదల చేసింది. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం. తాజా ప్రకటన ప్రకారం మొత్తం 1,785 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభమైంది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అనేక మంది అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ITI సర్టిఫికేట్ ఉన్నవారు అప్రెంటిస్ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు తమ దరఖాస్తులను డిసెంబర్ 17 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

26
రైల్వే ఉద్యోగాలు: అర్హతలు, వయస్సు పరిమితి

ఈ నియామకానికి దక్షిణ తూర్పు రైల్వే కొన్నిప్రధాన అర్హతలను నిర్ణయించింది

• కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

• గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు మించకూడదు (జనవరి 1, 2026 నాటికి).

• వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు.

• అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

• సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT నుంచి ITI సర్టిఫికేట్ తప్పనిసరి.

ఈ అర్హతలు ఉన్నవారే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని రైల్వే బోర్డ్ సూచించింది.

36
రైల్వే ఉద్యోగాలు: మొత్తం ఖాళీలు ఎన్ని?

ఈ నియామక ప్రక్రియ ద్వారా దక్షిణ తూర్పు రైల్వే కింద వివిధ వర్క్‌షాప్‌లు, విభాగాల్లో మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రైల్వే డివిజన్‌లలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ భవిష్యత్ రైల్వే ఉద్యోగాలలో, ముఖ్యంగా టెక్నికల్ పోస్టుల నియామకాల్లో, ఉపయోగపడేలా రూపొందించారు.

46
రైల్వే ఉద్యోగాలు : అప్లికేషన్ ఫీ వివరాలు

• General/OBC/Other Categories: ₹100

• SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు ఉంటుంది

దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలనీ, తమ అర్హతలను చెక్ చేసుకోవాలని రైల్వే సూచించింది.

56
రైల్వే ఉద్యోగాలు : ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి అభ్యర్థులు ఈ స్టెప్పులు ఫాలో అవ్వండి:

1. అధికారిక వెబ్‌సైట్లు https://oirms-ir.gov.in/rrbdv/ లేదా rrcser.co.in ను సందర్శించాలి.

2. హోమ్‌పేజీలో ఉన్న Recruitment/Apprentice 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.

3. కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.

4. వ్యక్తిగత, విద్య, కాంటాక్టు వివరాలు నమోదు చేయాలి.

5. అవసరమైన పత్రాలు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.

6. అప్లికేషన్ ఫీ చెల్లించాలి.

7. చివరిగా దరఖాస్తును సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

66
రైల్వే ఉద్యోగాలు : ఈ రిక్రూట్మెంట్ ఎందుకు ప్రత్యేకం?

ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ యువతకు ప్రభుత్వ రంగంలో నైపుణ్యం సాధించే అవకాశం ఇస్తుంది. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణులు, ITI సర్టిఫికేట్ కలిగినవారికి ఇది భవిష్యత్ రైల్వే టెక్నికల్ ఉద్యోగాలకు ఎంట్రీ గేట్ గా మారుతుంది. శిక్షణతో పాటు, భవిష్యత్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో పోటీ శక్తిని పెంపొందించడానికి ఇది ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories