Jobs : టెన్త్ పాసై, ఐటిఐ పూర్తిచేస్తే చాలు.. పోటీ పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

Published : Nov 05, 2025, 08:23 AM IST

Fact Jobs : కేవలం పదో తరగతి పాసైవుండి ఐటిఐ పూర్తిచేస్తే చాలు… ఎలాంటి పోటీ పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే అద్భుత అవకాశం. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేసుకొండి. 

PREV
16
పదో తరగతి పాసైతే చాలు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Central Government Job : భారతదేశంలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన FERTILISERS AND CHEMICALS TRAVANCORE LIMITED (FACT)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తక్కువ విద్యార్హతలు గల యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు.. కేవలం మెరిట్ ఆదారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాబట్టి కేవలం అప్లై చేస్తే చాలు… ఉద్యోగం సాధించవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

26
పోస్టులు, విద్యార్హతలు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (FACT) మూడు వేర్వేరు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. 

1. టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): అభ్యర్థులు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

2. క్రాఫ్ట్స్‌మ్యాన్ (మెషినిస్ట్): 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మెషినిస్ట్‌లో NTC (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్) ఉండాలి.

3. క్రాఫ్ట్స్‌మ్యాన్ (ఆటో ఎలక్ట్రీషియన్): 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో NTC ఉండాలి.

కేవలం పురుషులే ఈ ఉద్యోగాలకు అర్హులు. మహిళలకు అవకాశం లేదు.

36
వయో పరిమితి

అభ్యర్థుల వయస్సు 26 ఏళ్లకు మించకూడదు... అంటే 01.11.1999 నుండి 31.10.2007 మధ్య పుట్టినవారు అర్హులు. 01.11.2025 నాటికి వయసుకు పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబిసి అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పదో తరగతి మార్కుల లిస్టును ఏజ్ ప్రూఫ్ గా పరిగణిస్తారు.

46
దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా, మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. పోటీ పరీక్షల భయం లేకుండా ఉద్యోగం కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశం.

• దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.11.2025

• దరఖాస్తు చివరి తేదీ: 15.11.2025

అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫ్యాక్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, ఆ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన అన్ని పత్రాల కాపీలను జతచేసి, కింద ఇచ్చిన చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.

56
దరఖాస్తు పంపాల్సిన చిరునామా

DGM(HR), HR Department, FEDO Building, FACT, Udyogamandal, PIN-683501 అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ లో నవంబర్ 21 లోపు చేరేలా పంపించాలి.

66
సాలరీ

ఎంపికైన వారందరికీ నెలకు రూ. 25,000/- జీతం ఇస్తారు. ఏడాదికి 3 శాతం పెంపు ఉంటుంది. ఈఎస్ఐ, పిఎఫ్, షిప్ట్ అలవెన్స్, టీఏ, డిఏ, సెలవులు వంటి అలవెన్సులు ఉంటాయి.

గమనిక : కాంట్రాక్ట్ పద్దతిలో ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లు మాత్రమే FACT లో ఉద్యోగావకాశం ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని అర్హతలను పూర్తిగా చదివి నిర్ధారించుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories