ఇంధన ధరలపై వ్యాట్ తగ్గింపునకు తెలుగు రాష్ట్రాలు వెనక్కి: కారణం ఇదీ...

First Published Nov 9, 2021, 1:03 PM IST

నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్‌(petrol), డీజిల్‌ (diesel)ధరలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దీపావళి(diwali)కి ఒకరోజు ముందు ప్రజలకు కానుకగా పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఇంధన ధరలు (fuel price)రూ.5 నుంచి 10 వరకు తగ్గాయి. 

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి. అయితే బీజేపీ ప్రభుత్వం లేని  పాలిత రాష్ట్రాలు చాలా వరకు వ్యాట్‌ను తగ్గించేందుకు దూరంగా ఉన్నాయి. అప్పటి నుంచి రాజకీయాలు జోరందుకున్నాయి. 

దేశవ్యాప్తంగా చాలా వరకు బి‌జే‌పి పాలిత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత దశలవారీగా వారి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) తగ్గించాయి. దీంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.05, రూ.10 తగ్గాయి.  వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, అస్సాం, బీహార్, హర్యానా ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. 

వ్యాట్ తగ్గింపుకు దూరంగా ఉన్న  రాష్ట్రాలు
గత వారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం   ప్రకారం  ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సమాచారం విడుదల ప్రకారం వీటిలో మహారాష్ట్ర, జాతీయ రాజధాని ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, అండమాన్ అండ్ నికోబార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఉన్నాయి. 
 

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డా విపక్షాలు 
కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం కేవలం పరిహారం కోసం చేస్తున్న కసరత్తు మాత్రమేనని విపక్షాలు వాదిస్తున్నాయి. 13 రాష్ట్రాలు, మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 29 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు చెబుతున్నాయి. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానాన్ని కోల్పోయింది. అలాగే ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదలపై  ఆ రాష్ట్రంలోని బిజెపి నాయకులను స్వయంగా నిందించారు.  
 

పెట్రోల్, డీజిల్‌ పై రెండు రకాల పన్ను 
దేశంలో పెట్రోల్, డీజిల్‌పై రెండు రకాల పన్ను  విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఐదు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం, సెస్ విధిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) విధిస్తున్నాయి. వ్యాట్‌లో మార్పు కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో  ఇంధన ధరలు కూడా మారడం గమనించాలి. 

click me!