RBI: క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు, క్రిప్టోలతో ఆర్థిక భద్రతకు ముప్పు...

First Published Jun 30, 2022, 10:01 PM IST

రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతకు క్రిప్టో కరెన్సీలు స్పష్టమైన ముప్పు అని ఆయన అన్నారు. దీనిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 
 

RBI

దేశంలో  ఆర్థిక భద్రతకు క్రిప్టోకరెన్సీ మంచిది కాదని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి పేర్కొన్నారు. అంతే కాదు క్రిప్టో కరెన్సీల ద్వారా  స్పష్టమైన ముప్పు ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో అధికారులచే కఠినమైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలపై శక్తికాంత్ దాస్ మరోసారి హెచ్చరించారు. క్రిప్టోకరెన్సీల వల్ల స్పష్టమైన ప్రమాదం ఉందని దాస్ చెప్పారు. 

సరియైన పద్ధతి లేకుండానే ఒక ఆస్తి విలువను ఊహాజనితంగా నిర్ధారించడం, జూదం వంటిదే అని ఆయన అన్నారు. వివిధ వాటాదారులు మరియు సంస్థల నుండి ఇన్‌పుట్‌లను సేకరించిన తర్వాత క్రిప్టోకరెన్సీలపై సరైన వైఖరిని ఖరారు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీల గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్‌ఎస్‌ఆర్) యొక్క 25వ సంచికకు ముందుమాటలో, ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న డిజిటల్‌గా మారుతున్నందున, సైబర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రత్యేక శ్రద్ధ అవసరమని దాస్ అన్నారు.

ద్రవ్యోల్బణంపై ఏమన్నారు:

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ ప్రభావంతో తలెత్తే యుద్ధాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు అనుకోని ఉపద్రవాలను, ప్రమాదాలను స్పృహతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, అయితే  భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరోనా అనంతరం పునరుజ్జీవన బాటలో ఉందని ఆర్‌బిఐ పేర్కొంది. 

ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్‌ఎస్‌ఆర్) నివేదిక ప్రకారం కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం పునరుజ్జీవన మార్గంలో ఉందని. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాల కారణంగా, పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించడం, దగ్గరగా పర్యవేక్షించడం అవసరం." ఉందని నివేదికలో పేర్కొన్నారు. 
 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, నిరంతర అధిక ద్రవ్యోల్బణం,  COVID-19 మహమ్మారి వేవ్ లను ఎదుర్కోవటానికి సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న ద్రవ్య చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దృక్పథం  అనిశ్చితంగా ఉందని నివేదిక పేర్కొంది.
 

బ్యాంకింగ్ రంగంపై RBI నివేదిక ప్రకారం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (SCBలు) మూలధనానికి రిస్క్-వెయిటెడ్ అసెట్ రేషియో (CRAR) మార్చి 2022 నాటికి వాటి స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) నిష్పత్తి 16.7 శాతానికి చేరుకుంది. ఆరేళ్ల కనిష్ట స్థాయి 5.9 శాతానికి పడిపోయింది. నివేదిక ప్రకారం, తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలో కూడా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల  SCBలు కనీస మూలధన అవసరాలకు కట్టుబడి ఉండగలవని క్రెడిట్ రిస్క్ కోసం సమగ్ర ఒత్తిడి పరీక్ష నివేదికలు సూచిస్తున్నాయి.

click me!