Business Ideas: ప్లాస్టిక్ సంచుల బ్యాన్‌తో యువతకు ఉపాధి అవకాశం, రోజుకు 10 వేలు సంపాదించే బిజినెస్ ప్లాన్ ఇదే..

First Published Jul 5, 2022, 7:55 PM IST

జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఈ నిర్ణయం చాలా కంపెనీలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు ఒక ఆదాయ వనరుగా కూడా మారనుంది. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధం కారణంగా నాన్ వోవెన్ బ్యాగ్‌లకు (Non Woven Bag) డిమాండ్ పెరిగింది. Non Woven Bag ల తయారీకి భారీ పెట్టుబడి అవసరం లేదు, కేవలం చిన్న పెట్టుబడి పెడితే చాలు,  ప్రతినెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. Non Woven Bag తయారీ యూనిట్ ద్వారా మీరు మీ స్వంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో తెలుసుకుందాం.

నేటి కాలంలో, తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం సంపాదించగలిగే వ్యాపారం ప్రారంభించాలని అందరూ అనుకుంటారు. మీరు చాలా కాలంగా అలాంటి ప్లాన్‌లో ఉన్నట్లయితే, ఇది మీకు మంచి అవకాశం. వాస్తవానికి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించిన వెంటనే, ప్రత్యామ్నాయంగా మాల్స్‌తో సహా ఇతర ప్రదేశాలలో వస్తువుల ప్యాకింగ్,  డెలివరీ కోసం నాన్ వోవెన్ బ్యాగ్‌లను ఉపయోగించడం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితిలో Non Woven Bags డిమాండ్ వేగంగా పెరుగుతుంది.

నాన్ వోవెన్ బ్యాగ్‌ల వ్యాపారం (Non Woven Bag Making Business Idea) తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఇంతవరకు ఈ బ్యాగ్ వాడకం మార్కెట్లో చాలా తక్కువగా ఉండేది, ప్లాస్టిక్ నిషేధం తరువాత, వీటి డిమాండ్ పెరిగింది. అలాగే తయారీ కూడా పెరుగుతుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కొన్ని యంత్రాలు,స్థలం అవసరం, పెట్టుబడి అవసరం అవుతాయి. 

మూడు యంత్రాల సహాయంతో పని ప్రారంభించవచ్చు...
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు మూడు రకాల యంత్రాలు అవసరం. వీటిలో ఫాబ్రిక్ కట్టింగ్ మెషీన్లు, సీలింగ్ మెషీన్లు, హైడ్రాలిక్ పంచింగ్ మెషీన్లు అవసరం పడతాయి. మీరు ఈ మెషీన్లను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ యంత్రాల అంచనా వ్యయం గురించి మాట్లాడుకుంటే, మూడు యంత్రాలు కొనుగోలు చేయడానికి సుమారు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.

నాన్ వోవెన్ బ్యాగ్స్ ఇలా తయారవుతాయి
అన్నింటిలో మొదటిది, ఫాబ్రిక్ కట్టింగ్ మెషిన్ సహాయంతో, బట్టను బ్యాగ్ ఆకారంలో కత్తిరించుకోవచ్చు. ఆ తరువాత, సీలింగ్ యంత్రం సహాయంతో, కట్ బ్యాగ్ మూడు వైపుల నుండి కుడుతుంది. ఈ పని పూర్తయిన తర్వాత, చివరకు బ్యాగ్  హ్యాండిల్ హైడ్రాలిక్ పంచింగ్ మెషీన్‌ కత్తిరిస్తుంది. మీరు తయారు చేసిన బ్యాగ్‌కు భిన్నమైన రూపాన్ని ఇవ్వాలనుకుంటే, మీరు ప్రింటింగ్ మెషీన్‌ని ఉపయోగించి కంపెనీ ఆర్డర్ ప్రకారం లోగో, ఇతర డిజైన్‌లను కూడా బ్యాగ్ పై ప్రింట్ చేయవచ్చు. 

రోజుకు రూ.10, 000 వరకు సంపాదించే చాన్స్ 
విశేషమేమిటంటే, దీని ముడిసరుకు అంటే ఫాబ్రిక్ కూడా సులభంగా దొరుకుతుంది.  ఫాబ్రిక్ క్వాలిటీని బట్టి ఖర్చును తగ్గించుకోవచ్చు. ఫాబ్రిక్ ఉపయోగించి ఈ యంత్రాల ద్వారా ఒక రోజులో 5000 కంటే ఎక్కువ సంచులను తయారు చేయవచ్చు. నాన్ వోవెన్‌తో తయారు చేసిన బ్యాగులను కిలో కనీసం రూ.100కు విక్రయించవచ్చు. నాణ్యత కాస్త మెరుగ్గా ఉంటే కిలో 150 రూపాయలకు అమ్మవచ్చు. ఇలా రోజూ దాదాపు 10 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. దీనితో పాటు, డిమాండ్ పెరిగి ఎక్కువ ఆర్డర్లు భారీగా వస్తే ఆదాయం మరింత పెరగవచ్చు.

కరోనా కాలంలో నాన్ వోవెన్ వాడకం పెరిగింది
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్ వాడకం పెరిగింది. పీపీఈ కిట్‌ల నుంచి మాస్క్‌ల తయారీ వరకు ఈ ఫాబ్రిక్ నే వినియోగిస్తున్నారు. దీనితో పాటు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ఇది మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వీటిని ఉపయోగిస్తున్నారు.  కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించింది. దీంతో పెరుగుతున్న డిమాండ్ చాలా మందికి అవకాశంగా మారేవీలుంది. 

click me!