బరువు తగ్గాలంటే ఏం తినొద్దు?

First Published | May 8, 2024, 4:52 PM IST

అతిగా తింటూ, ఎలాంటి శారీరక శ్రమ చేయకుంటే ఖచ్చితంగా మీరు బరువు పెరుగుతారు. బరువు తగ్గాలంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే?
 

బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొందరు జెనెటిక్స్ గా బరువు పెరిగితే.. మరికొంతమంది మాత్రం తినడం వల్ల బరువు పెరుగుతారు. చాలా మంది హెవీగా తిని ఎలాంటి వ్యాయామం చేయకుండా ఉంటారు. దీనివల్ల శరీర బరువు బాగా పెరుగుతుంది. కానీ బరువు పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి బరువు పెరగకుండా ఉండటానికి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

స్వీట్స్

స్వీట్స్ ను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. చాలా మందికి ఉదయం, సాయంత్రం వేళల్లో స్వీట్లను తినే అలవాటు పక్కాగా ఉంటుంది. కానీ స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ప్రతి రోజూ మీరు స్వీట్లను తింటే బ్లడ్ షుగర్ పెరగడంతో పాటుగా బరువు కూడా బాగా పెరుగుతారు. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం స్వీట్లను తినడం మానేయాలి. 
 


weightloss

ఆలుగడ్డ

ఆలుగడ్డ కూడా మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. అవును బంగాళదుంప ఫ్రైస్, బంగాళాదుంప చిప్స్, సమోసాలు అంటూ బంగాళాదుంపను వివిధ మార్గాల్లో తింటే కూడా మీ బరువు మరింత పెరుగుతుంది. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువను పెంచుతాయి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వీటిని మాత్రం తినకండి. 
 

జంక్ ఫుడ్స్ 

జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ బలే టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది ప్రతి రోజూ పిజ్జా, బర్గర్స్ వంటి  జంక్ ఫుడ్స్ ను ప్రతిరోజూ తింటుంటారు. కానీ ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతారు. వీటిని తింటే మీరు బరువు తగ్గే ప్రసక్తే ఉండదు.
 

శీతల పానీయాలు

ముందే ఎండాకాలం. దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ కోకాకోలా, సోడాలు వంటి శీతల పానీయాలను ఎక్కువ మోతాదులో తాగుతుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా మీ బరువును కూడా బాగా పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే మాత్రం వీటిని అస్సలు తాగకండి

weight loss

చాక్లెట్

చాక్లెట్ చాలా మందికి ఇష్టం. వీటిని ఆడవాళ్లు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఒకేసారి వీటిని చాలా కొనేసి వీలున్నప్పుడల్లా తింటుంటారు. కానీ చాక్లెట్ ను ఎక్కువగా తినడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. 

Latest Videos

click me!