OYO: ఓయోలో రూమ్‌ బుక్‌ చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ప్రైవసీ సేఫ్‌

Published : Mar 29, 2025, 05:00 PM IST

ప్రముఖ హోటల్‌ బుకింగ్ సంస్థ ఓయోకు అంతర్జాతీయంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తో హోటల్‌ రూమ్స్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చిందీ సంస్థ. భారత్‌లో మొదలైన ఓయో సేవలు ప్రస్తుతం ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి..   

PREV
15
OYO: ఓయోలో రూమ్‌ బుక్‌ చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ప్రైవసీ సేఫ్‌
Oyo Room

ఓయోలో రూమ్‌ చేసుకోవాలంటే చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. అందుబాటులో ధరలో గదులు లభించడంతో ఎక్కువ మంది వీటికి మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా ఓయో యువతకు ఫెవరేట్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ఓయోలో నిబంధనలను కఠినతరం చేశారు. పెళ్లి కానీ జంటలకు గదులు ఇవ్వకూడదనే నిబంధనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆధార్‌ కార్డు లాంటి ఐడీ ప్రూఫ్‌ను చూపిస్తే గదులను ఇస్తుంటారు. 

25

ఫోన్‌లో బుక్‌ చేసుకున్నా నేరుగా హోటల్‌కు వెళ్లిన సమయంలో ఆధార్‌ కార్డు జిరాక్స్‌ సబ్‌మిట్‌ చేయడం లేదా ఆధార్‌ వివరాలను చూపించాల్సి ఉంటుంది. దీంతో ఇది వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఆధార్‌ కార్డు వివరాలను పంచుకునే విషయంలో ఓ సురిక్షిత విధానం అందుబాటులో ఉందని తెలుసా.? అదే మాస్క్డ్‌ ఆధార్‌ కార్డు. ఇంతకీ ఏంటీ ఆధార్‌ దీంతో ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

35

మాస్క్డ్‌ ఆధార్‌ కార్డ్‌ అంటే ఏంటి.? ఇందులో ఏముంటుంది.? 

ఆధార్‌ కార్డును డిజిటల్‌ రూపంలో చూపించే ఆప్షన్‌ను మాస్క్డ్‌ ఆధార్‌ కార్డు అంటారు. పేరుకు తగ్గట్లుగానే ఈ ఆధార్‌లో చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 12 అంకెలు కనిపించకుండా ఉంటాయి. దీంతో మీ సమాచారం సురక్షితంగా ఉంటుంది. కేవలం ఓయో వంటి రూమ్‌ బుక్సింగ్స్‌లో మాత్రమే కాకుండా ఇతర చోట్ల కూడా ఈ మాస్క్డ్‌ ఆధార్‌ కార్డును చూపించవచ్చు. అంతేకాదు మాస్క్డ్ ఆధార్ కార్డును డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సైతం అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ మాస్క్డ్‌ ఆధార్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

45

* ఇందుకోసం ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 

* అనంతరం ‘మై ఆధార్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. 

* మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ని ఎంటర్‌ చేయండి. 

* వెంటనే మీ రిజిస్టర్‌ ఫోన్‌ నెంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. 

* ఓటీపీ ఎంటర్‌ చేయగానే మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతుంది. 

* ఈ సమయంలో 'మాస్క్డ్‌ ఆధార్‌'ను సెలక్ట్‌ చేసుకోవాలి. చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే మాస్క్డ్‌ ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. 
 

55

పీడీఎఫ్‌ ఫైల్‌ను ఎలా ఓపెన్ చేయాలంటే.? 

డౌన్‌లోడ్‌ అయిన మాస్క్డ్‌ ఆధార్‌ పీడీఎఫ్‌ రూపంలో ఉంటుంది. అయితే ఈ ఫైల్‌ నేరుగా ఓపెన్‌ అవదు, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఇందుకోసం మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపి ఎంటర్‌ చేయాలి. వెంటనే మీ ఆధార్‌ కార్డు ఓపెన్‌ అవుతుంది. ఉదాహరణకు మీరు SRIIMAN, మీ పుట్టిన సంవత్సరం 1991 అనుకుందాం. అప్పుడు పాస్‌వర్డ్‌ 'SRIM1991' అవుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories