Bluetooth: రోజుకు ఎంత సేపు బ్లూటూత్ వాడాలో తెలుసా? టైమ్ దాటితే ప్రమాదమే

Published : Mar 29, 2025, 01:29 PM IST

Bluetooth: మీరు బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతుంటారా? రోజుకు గంటల తరబడి వాటిని ఉపయోగిస్తారా? ఇది చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి.. రోజుకు ఎంతసేపు బ్లూటూత్ ఉపయోగించాలి? బ్లూటూత్ వల్ల ఉపయోగాలు, నష్టాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
Bluetooth: రోజుకు ఎంత సేపు బ్లూటూత్ వాడాలో తెలుసా? టైమ్ దాటితే ప్రమాదమే

మనలో చాలామంది మల్టీటాస్కింగ్ చేస్తుంటాం. అంటే.. ఒకేసారి రెండు పనులు చేయడం. బైక్ నడుపుతూనే ఫోన్ మాట్లాడటం, కార్ డ్రైవింగ్  చేస్తూనే పాటలు వినడం, ల్యాప్ టాప్ లో ఆఫీస్ వర్క్ చేస్తూనే కాల్స్ మాట్లాడటం, మహిళలలైతే వంట చేస్తూ పాటలు వినడం, మధ్యలో వీడియోలు చూడటం ఇలా చాలా మంది మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. ఇలా చేయాలంటే బ్లూటూత్ తప్పకుండా ఉపయోగించాలి. రెండు పనులు ఒకేసారి చేస్తుండటం మంచిదే అయినా గంటల తరబడి బ్లూటూత్ పెట్టుకొని ఉండటం చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
 

25

బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వల్ల కలిగే నష్టాలు

రేడియేషన్ ప్రభావం

బ్లూటూత్ పరికరాలు కూడా రేడియేషన్ విడుదల చేస్తాయి. కాని సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ లతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉంటాయి. దీని ప్రభావం మన శరీరంపై ఎలా ఉంటుందో శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని డాక్టర్లు అంటున్నారు. ఎక్కువ కాలం కంటిన్యూగా బ్లూటూత్ వాడటం వల్ల బ్రెయిన్ టిష్యూపై ప్రభావం పడుతుందని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. 
 

35

చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు

ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల చెవి లోపల చెమట పట్టి ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. ఇవి చెవిలో సరిగ్గా ఫిట్ కాకపోతే చెవుల్లో నొప్పి లేదా ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ శబ్దంతో బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వినడం వల్ల చెవి నాడులు దెబ్బతినే ప్రమాదం ఉందట. బ్లూటూత్ వల్ల దీర్ఘకాలిక వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. 
 

45

మానసిక ఒత్తిడి, నిద్రలేమి

బ్లూటూత్ పెట్టుకొని ఎక్కువ శబ్దంతో వినడం నాడీ వ్యవస్థపై ఒత్తిడిని కలుగుతుంది. బ్లూటూత్ ఎక్కువసేపు వాడటం నిద్రలేమి(insomnia), మానసిక ఆందోళన కలుగుతాయి. 

ప్రమాదాలకు ఆస్కారం

డ్రైవింగ్ లేదా నడుస్తున్నప్పుడు బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వినడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయి. చాలా ప్రమాదాలకు సెల్ ఫోన్ మాట్లాడటమే కారణమని తెలుస్తోంది. 

55

బ్లూటూత్ ను రోజుకు ఎంత సేపు వాడాలి

రోజుకు గంట మించి బ్లూటూత్ వాడకూడదు. కంటిన్యూగా బ్లూటూత్ పెట్టుకొని ఉండటం వల్ల చెవి నిర్మాణం దెబ్బతింటుంది. బ్లూటూత్ పెట్టుకున్నా తక్కువ శబ్దంతో వినాలి. ముఖ్యంగా మంచి బ్రాండ్‌కి చెందిన ఇయర్‌ఫోన్స్ మాత్రమే వాడాలి. ఇయర్‌ఫోన్స్ ని తరచుగా శుభ్రంగా ఉంచాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి.

ఇది కూడా చదవండి ట్యాబ్లెట్‌ కొనాలనుకుంటున్నారా? టాప్ 5 బెస్ట్ డీల్స్ ఇవిగో

Read more Photos on
click me!

Recommended Stories