Aadhaar: ఆధార్‌-బ్యాంక్‌ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలో తెలుసా.? ఎక్కడకి వెళ్లాల్సిన పనిలేదు, ఫోన్‌లోనే

Published : Mar 29, 2025, 02:39 PM ISTUpdated : Mar 29, 2025, 03:12 PM IST

ఆధార్‌ కార్డ్‌ అన్నింటికీ ఆధారంగా మారిపోయిన విషయం తెలిసిందే. సిమ్‌ కార్డు మొదలు చివరికి దేవాలయాల్లో దర్శనం టికెట్‌ బుక్‌ చేసుకోవాలన్నా ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. ఇక బ్యాంకుల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Aadhaar: ఆధార్‌-బ్యాంక్‌ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలో తెలుసా.? ఎక్కడకి వెళ్లాల్సిన పనిలేదు, ఫోన్‌లోనే

పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకుందామని అనుకుంటారు. ఈపీఎఫ్‌ వెబ్‌సైట్‌లోకి ప్రాసెస్‌ అంతా పూర్తి చేస్తారు. చివరికి మీ బ్యాంక్‌ అకౌంట్‌ ఆధార్‌తో లింక్‌ లేదని అలర్ట్‌ వస్తుంది. దీంతో ఆధార్‌ లింక్‌ చేశాక మళ్లీ ప్రాసెస్‌ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య కచ్చితంగా అందరికీ వచ్చే ఉంటుంది. 
 

25

ప్రస్తుతం బ్యాంక్‌ అకౌంట్ ఓపెన్‌ చేయాలంటే కచ్చితంగా ఆధార్‌ అడుగుతున్నారు. అయితే ఒకప్పుడు మాత్రం ఆధార్‌ లేకుండానే బ్యాంక్‌ అకౌంట్ ఓపెన్‌ చేసేవారు. కానీ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా బ్యాంక్‌ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంట్లోనే ఉంటూ మీ ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ను లింక్‌ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? ఇందుకోసం ఫాలో కావాల్సిన సింపుల్‌ స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35

* ఇందుకోసం ముందుగా NPCI వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 

* లింక్‌ ఓపెన్‌ చేసిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే 'కన్జ్యూమర్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. 

* ఆ తర్వాత భారత్‌ ఆధార్‌ సీడింగ్‌ ఎనేబుల్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

* తర్వాత ఓపెన్‌ అయిన పేజీలో ఏడమ వైపు కొన్ని ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో 'ఆధార్‌ సీడింగ్‌/డీసిడింగ్‌' అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
 

45

* అనంతరం మీ ఆధార్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. ఆధార్‌ లింక్‌ చేయాలనుకుంటే సీడింగ్‌, ఒకవేళ లింక్‌ అయిన దానిని తీసివేయాలనుకుంటే డీసిడింగ్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి. 

* సీడింగ్ సెలక్ట్‌ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్‌ పేరును సెలక్ట్‌ చేసుకొని, అకౌంట్‌ నెంబర్‌ను కన్ఫామ్‌ చేయాలి. 

* చివరిగా పేజీ చివరిలో ఉండే క్యాప్చాను ఎంటర్‌ చేసి సబ్‌బిట్ చేయాలి. అంతే.. రెండు నుంచి మూడు రోజుల్లో మీ ఆధార్‌, బ్యాంక్‌ లింక్‌ పూర్తవుతుంది. 
 

55

స్టేటస్‌ ఎలా తెలుసుకోవాలంటే.? 

ఆధార్‌-బ్యాంక్‌ అకౌంట్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవడానికి. ఎడమ వైపు స్క్రీన్‌లో కనిపించే 'ఆధార్‌ మ్యాప్డ్‌ స్టేటస్‌'ను క్లిక్‌ చేయాలి. అనంతరం మీ ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తే లింక్‌ స్టేటస్‌ తెలిసిపోతుంది. ఈ ప్రాసెస్‌ను మీ ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. బ్యాంకుకు లేదా ఆధార్‌ సేవ కేంద్రానికి వెళ్లినా వాళ్లు చేసే పని ఇదే. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చేసుకోవచ్చన్నమాట.  
 

Read more Photos on
click me!

Recommended Stories