అకౌంట్ అగ్రిగేటర్ నెట్‌వర్క్ అంటే ఏమిటి - ఫైనాన్షియల్ డేటా షేరింగ్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోండి.

First Published Sep 10, 2021, 3:33 PM IST

గత వారం భారతదేశం అకౌంట్ అగ్రిగేటర్ (ఏ‌ఏ) నెట్‌వర్క్‌ను ఆవిష్కరించింది. ఇది పెట్టుబడి, క్రెడిట్‌లో విప్లవాత్మకమైన ఆర్థిక డేటా-షేరింగ్ సిస్టమ్, కోట్ల మంది వినియోగదారులకు వారి ఆర్థిక రికార్డులపై గొప్ప అక్సెస్, కంట్రోల్ అందిస్తుంది ఇంకా రుణదాతలు, ఫిన్‌టెక్ కంపెనీల కోసం పొటేంషియల్ కస్టమర్లను పెంచుతుంది. అక్కౌంట్ అగ్రిగేటర్ ఒక వ్యక్తి ఆర్థిక డేటాపై నియంత్రణ కలిగిస్తుంది.

ఇది భారతదేశంలో ఓపెన్ బ్యాంకింగ్‌ని తీసుకురావడానికి, లక్షలాది మంది కస్టమర్‌లను డిజిటల్‌గా యాక్సెస్ చేయడానికి, వారి ఆర్థిక డేటాను సురక్షితంగా ఇంకా సమర్ధవంతంగా పంచుకునేందుకు మొదటి అడుగు.

బ్యాంకింగ్‌లో అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ భారతదేశంలోని ఎనిమిది అతిపెద్ద బ్యాంకులతో ప్రారంభించారు. అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ రుణాన్ని, సంపద నిర్వహణను చాలా వేగంగా ఇంకా చౌకగా చేయగలదు.

1. అక్కౌంట్ అగ్రిగేటర్ అంటే ఏమిటి?

 ఒక అక్కౌంట్ అగ్రిగేటర్ (ఏ‌ఏ) అనేది ఒక రకమైన ఆర్‌బి‌ఐ నియంత్రిత సంస్థ (NBFC-AA లైసెన్స్‌తో), ఇది ఒక వ్యక్తికి సురక్షితంగా, డిజిటల్‌గా యాక్సెస్ చేయడానికి, ఏ‌ఏ నెట్‌వర్క్ లోని ఏదైనా ఇతర నియంత్రిత ఆర్థిక సంస్థకు ఖాతా ఉన్న ఒక ఆర్థిక సంస్థ నుండి సమాచారాన్ని పంచుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఒక వ్యక్తి అనుమతి లేకుండా డేటాను షేర్ చేయలేరు .

ఒక వ్యక్తి  అకౌంట్ అగ్రిగేటర్‌లు నుంచి ఎవరినైనా ఎంచుకోవచ్చు.అకౌంట్  అగ్రిగేటర్ మీ డేటా  వినియోగానికి అనుమతి, నియంత్రణ ద్వారా దశలవారీగా 'బ్లాంక్ చెక్' అక్సెప్టంస్ లాంగ్ టర్మ్, కండిషన్స్  భర్తీ చేస్తుంది.

2) కొత్త అక్కౌంట్ అగ్రిగేటర్ నెట్‌వర్క్ సాధారణ వ్యక్తి  ఆర్థిక జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?

 భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నేడు వినియోగదారులకు ఎన్నో అవాంతరాలు ఏర్పడ్డాయి - బ్యాంక్ స్టేట్‌మెంట్‌ సంతకం చేసిన, స్కాన్ చేసిన కాపీలను పంచుకోవడం, డాక్యుమెంట్ నోటరీ చేయడానికి లేదా స్టాంప్ చేయడానికి లేదా మీ వ్యక్తిగత యూజర్ పేరు, పాస్‌వర్డ్‌ని పంచుకోవడం ద్వారా  థర్డ్ పార్టీ మీ ఆర్థిక చరిత్రను అందిస్తుంది. అక్కౌంట్ అగ్రిగేటర్ నెట్‌వర్క్ వీటన్నింటినీ సింపుల్ గా, మొబైల్ ఆధారిత, సురక్షితమైన డిజిటల్ డేటా యాక్సెస్ & షేరింగ్ ప్రక్రియతో భర్తీ చేస్తుంది. ఇది కొత్త రకాల సేవలకు అవకాశాలను సృష్టిస్తుంది - ఉదా. కొత్త రకాల రుణాల వంటివి.

ఒక వ్యక్తి బ్యాంక్ కేవలం అక్కౌంట్ అగ్రిగేటర్ నెట్‌వర్క్‌లో చేరాలి. ఎనిమిది బ్యాంకులు ఇప్పటికే చేరాయి- నాలుగు బ్యాంకులు ఇప్పటికే  కన్సెంట్  (యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్‌ఇండ్ బ్యాంకులు) ఆధారంగా డేటాను పంచుకుంటున్నాయి. మరో నాలుగు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంక్ త్వరలో చేరానున్నాయి.

3) అకౌంట్ అగ్రిగేటర్ ఆధార్ ఈ‌కే‌వై‌సి డేటా షేరింగ్, క్రెడిట్ బ్యూరో డేటా షేరింగ్, సి‌కే‌వై‌సి వంటి ప్లాట్‌ఫారమ్‌లకు ఎలా భిన్నంగా ఉంటుంది?

ఆధార్ ఈ‌కే‌వై‌సి, సి‌కే‌వై‌సి (ఉదా. పేరు, చిరునామా, లింగం మొదలైనవి) నాలుగు 'గుర్తింపు' డేటా ఫీల్డ్‌లను పంచుకోవడానికి మాత్రమే అనుమతిస్తాయి. అదేవిధంగా క్రెడిట్ బ్యూరో డేటా లోన్ హిస్టరీ లేదా క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే చూపుతుంది. అక్కౌంట్ అగ్రిగేటర్ నెట్‌వర్క్ సేవింగ్స్/డిపాజిట్/కరెంట్ ఖాతాల నుండి లావాదేవీల డేటా లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పంచుకోవడానికి అనుమతిస్తుంది.
 

4) ఎలాంటి డేటాను పంచుకోవచ్చు?

నేడు ఈ నెట్‌వర్క్‌లో  బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ డాటా బ్యాంకుల మధ్య (ఉదాహరణకు, కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతా నుండి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు) పంచుకోవడానికి అందుబాటులో ఉంది.
 
క్రమంగా ఏ‌ఏ ఫ్రేమ్‌వర్క్ పన్ను డేటా, పెన్షన్ డేటా, సెక్యూరిటీల డేటా (మ్యూచువల్ ఫండ్స్ అండ్ బ్రోకరేజ్) సహా అన్ని ఆర్థిక డేటాను షేర్ చేసేందుకు అందుబాటులో ఉంచుతుంది. అలాగే ఇన్షూరెన్స్ డేటా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఏ‌ఏ ద్వారా ఆరోగ్య సంరక్షణ, టెలికాం డేటా ఒక వ్యక్తికి అందుబాటులో ఉండేలా ఆర్థిక రంగానికి మించి విస్తరిస్తుంది.

5) అక్కౌంట్ అగ్రిగేటర్స్ పర్సనల్ డేటాను చూడగలరా ? డేటా షేరింగ్ సురక్షితమేనా?

అక్కౌంట్ అగ్రిగేటర్లు డేటాను చూడలేరు. వారు కేవలం ఒక వ్యక్తి  డైరెక్షన్, కన్సెంట్ ఆధారంగా ఒక ఆర్థిక సంస్థ నుండి మరొక ఆర్థిక సంస్థకు తీసుకుంటారు. పేరుకు విరుద్ధంగా వారు మీ డేటాను 'అగ్రిగెట్' చేయలేరు. అక్కౌంట్ అగ్రిగేటర్స్  లు మీ డేటాను అగ్రిగేట్ అండ్ మీ పూర్తి ప్రొఫైల్‌లను సృష్టించే టెక్నాలజీ కంపెనీ వంటివి కావు .

 అక్కౌంట్ అగ్రిగేటర్స్ షేర్ చేసే డేటా పంపినవారు నుండే ఎన్ క్రిప్ట్ చేసి ఉంటుంది, దానిని ఎవరైతే పొందుతారో వారు మాత్రమే డీక్రిప్ట్ చేయవచ్చు. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అండ్ 'డిజిటల్ సిగ్నేచర్' వంటి టెక్నాలజీని ఉపయోగించడం పేపర్ డాక్యుమెంట్‌లను షేర్ చేయడం కంటే ప్రక్రియను మరింత సురక్షితంగా చేస్తుంది.
 

6) ఒక కన్జ్యూమర్ డేటాను షేర్ చేయవద్దని నిర్ణయించుకోవచ్చా ?

అవును. ఏ‌ఏతో రిజిస్టర్ కావడం వినియోగదారులకు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. వినియోగదారుడు ఉపయోగిస్తున్న బ్యాంక్ నెట్‌వర్క్‌లో చేరినట్లయితే, తను ఏ‌ఏలో రిజిస్టర్ చేసుకోవడానికి ఎంచుకోవచ్చు, వారు ఏ ఖాతాలను లింక్ చేయాలనుకుంటున్నారో కూడా ఎంచుకోవచ్చు, కొత్త ఖాతాదారుడికి లేదా ఆర్థిక సంస్థకు కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం వారి ఖాతాలలో ఒకదాని నుండి తమ డేటాను పంచుకోవచ్చు అక్కౌంట్ అగ్రిగేటర్‌లలో ఒకరి ద్వారా 'కన్సెంట్' ఇచ్చే దశలో. కస్టమర్ ఎప్పుడైనా అభ్యర్థనను పంచుకోవడానికి కన్సెంట్ తిరస్కరించవచ్చు. ఒకవేళ వినియోగదారుడు కొంత వ్యవధిలో (ఉదా. రుణ కాలంలో) డేటాను పునరావృత పద్ధతిలో పంచుకోవడానికి అంగీకరించినట్లయితే, అది కూడా తర్వాత ఎప్పుడైనా వినియోగదారుడు రద్దు చేయవచ్చు.

 7) ఒక కన్జ్యూమర్ ఒక సంస్థతో ఒకసారి డేటాను పంచుకున్నట్లయితే, వారు దానిని ఎంతకాలం ఉపయోగించవచ్చు?

రిసిపియంట్ సంస్థ యాక్సెస్ ఉన్న ఖచ్చితమైన కాల వ్యవధి డేటా షేరింగ్ కోసం కన్సెంట్ సమయంలో కన్జ్యూమర్ కి చూపబడుతుంది.

8) ఏ‌ఏతో ఒక కస్టమర్ ఎలా నమోదు చేసుకోవచ్చు?

మీరు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఏ‌ఏతో రిజిస్టర్ చేసుకోవచ్చు. కన్సెంట్ ప్రక్రియలో ఏ‌ఏ హ్యాండిల్ (యూజర్ నేం వంటిది) అందిస్తుంది.

 నేడు, ఏ‌ఏలుగా ఉండటానికి అపరేషనల్ లైసెన్స్‌లతో నాలుగు యాప్‌లు డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయి (Finvu, OneMoney, CAMS Finserv, మరియు NADL). ఆర్‌బి‌ఐ (PhonePe, Yodlee, Perfios) నుండి మరో ముగ్గురు సూత్రప్రాయంగా ఆమోదం పొందాయి. త్వరలో యాప్‌లను ప్రారంభించవచ్చు.

9) కస్టమర్ ప్రతి ఏ‌ఏతో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా?

లేదు, నెట్‌వర్క్‌లోని ఏదైనా బ్యాంక్ నుండి డేటాను యాక్సెస్ చేయడానికి కస్టమర్ ఏదైనా ఏ‌ఏతో రిజిస్టర్ చేసుకోవచ్చు.

 10) ఈ సదుపాయాన్ని ఉపయోగించినందుకు కస్టమర్ ఏ‌ఏకి చెల్లించాల్సిన అవసరం ఉందా?

ఇది ఏ‌ఏ పై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక సంస్థలు సర్వీస్ చార్జ్ వసూలు చేస్తున్నందున కొన్ని ఏ‌ఏలు ఉచితం. కొందరు తక్కువ యూజర్ ఫీజు వసూలు చేయవచ్చు.
 

11) డేటా షేరింగ్ ఏ‌ఏ నెట్‌వర్క్‌లో వారి బ్యాంక్ చేరినట్లయితే కస్టమర్ ఏ కొత్త సేవలను యాక్సెస్ చేయవచ్చు?

రెండు కీలకమైన సేవలు ఒక వ్యక్తి  రుణాలు, డబ్బు నిర్వహణ యాక్సెస్ కోసం  మెరుగ్గ చేయబడుతుంది. ఒక కస్టమర్ ఈ రోజు చిన్న వ్యాపారం లేదా వ్యక్తిగత రుణం పొందాలనుకుంటే రుణదాతతో పంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ గజిబిజి ఇంకా మాన్యువల్ ప్రక్రియ రుణం సేకరించడానికి తీసుకున్న సమయం, యాక్సెస్‌ని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా డబ్బు నిర్వహణ నేడు కష్టంగా ఉంది ఎందుకంటే డేటా చాలా ప్రదేశాలలో స్టోర్ చేయబడుతుంది, సులభంగా అనాలసీస్ చేయడానికి కష్టంగా ఉంటుంది.

అక్కౌంట్ అగ్రిగేటర్ ద్వారా ఒక కంపెనీ వేగంగా, చౌకగా ట్యాంపర్-ప్రూఫ్ సురక్షిత డేటాను యాక్సెస్ చేయవచ్చు. రుణ ఎవాల్యుయేషన్ ప్రక్రియను వేగంగా ట్రాక్ చేయవచ్చు, తద్వారా కస్టమర్ రుణం పొందవచ్చు. అలాగే, ఒక కస్టమర్ తాకట్టు పెట్టడం లేకుండా రుణం పొందవచ్చు, భవిష్యత్తులో ఇన్‌వాయిస్ లేదా నగదు ప్రవాహంపై సమాచారాన్ని నేరుగా ప్రభుత్వ వ్యవస్థ నుండి పంచుకోవడం ద్వారా ఊదాహరణకు జి‌ఎస్‌టి లేదా జి‌ఈ‌ఎం.

click me!