Published : Aug 12, 2025, 03:05 PM ISTUpdated : Aug 12, 2025, 03:06 PM IST
EPFO కి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు PF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నిమిషాల్లో PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా ఉద్యోగులకు నెలా నెలా వారి PF ఖాతాల్లో డబ్బులు జమ అవుతుంటాయి. ఉద్యోగుల జీతం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి పీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తుంటాయి సంస్థలు. రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు PF చక్కగా ఉపయోగపడుతుంది. అయితే నెలా నెలా ఎంత PF కట్ అవుతోంది? దానికి ఎంత వడ్డీ వస్తోంది? అసలు PF ఖాతాలో ఎంత మొత్తం ఉంది వంటి విషయాలు ఈజీగా ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.
24
EPF బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?
మీ UAN (యూనివర్సల్ ఖాతా నంబర్) ఉపయోగించి మీ EPF (ఉద్యోగుల భవిష్య నిధి) బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అందుకోసం EPFO పోర్టల్, SMS సర్వీస్ లేదా UMANG యాప్ వాడొచ్చు. మీ PF బ్యాలెన్స్, కాంట్రిబ్యూషన్స్ అన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 9966044425 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
రెండు సార్లు రింగ్ అయ్యాక ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది.
మీ EPF బ్యాలెన్స్, లాస్ట్ కాంట్రిబ్యూషన్ డిటైల్స్‌తో మీ నెంబర్ కు SMS వస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
మీ UAN యాక్టివ్‌గా ఉండాలి. KYC డిటైల్స్ (ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా) లింక్ చేసి ఉండాలి. SMS, మిస్డ్ కాల్ సర్వీసెస్‌కి వాడే మొబైల్ నెంబర్ మీ UANలో రిజిస్టర్ అయి ఉండాలి. మీ PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మీ కంపెనీ HRని కూడా సంప్రదించవచ్చు.