మనం బతకడానికి డబ్బు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యం. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా డబ్బులు పొదుపు చేయొచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
చాలామంది డబ్బు పొదుపు చేయడం అంటే ఇష్టమైన వాటిని త్యాగం చేయడం అనుకుంటారు. పొదుపు చేయడం వల్ల నచ్చింది తినలేము, ఇష్టమైనవి కొనుక్కోలేము అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా కూడా డబ్బులు పొదుపు చేయవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
25
స్మార్ట్ గా ఆలోచించండి
కొంచెం స్మార్ట్ గా ఆలోచిస్తే మనకి నచ్చినవి చేస్తూనే డబ్బును పొదుపు చేసుకోవచ్చు. మీ నెలవారీ జీతాన్ని.. ఇంటి అద్దె, కిరాణా బిల్లు, కరెంటు బిల్లు వంటి వాటికోసం ఖర్చు పెట్టే ముందు, పొదుపు కోసం కొంత మొత్తాన్ని పక్కకు పెట్టండి. జీతం వచ్చిన వెంటనే పొదుపు అమౌంట్ కట్ అయ్యేలా ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సెట్ చేసుకోండి.
రెండు అకౌంట్లు..
వీలైతే రెండు అకౌంట్లు మెయింటేన్ చేయండి. ఒకటి ఖర్చులకు, ఒకటి పొదుపు చేయడానికి. ఖాతాలు వేరుగా ఉంచుకోవడం వల్ల వాటిలోని డబ్బు వాడుకోకుండా ఉండడానికి వీలు ఉంటుంది. సాధారణంగా ఒకటే అకౌంట్ ఉంటే.. ఏదైనా షాపింగ్ కి వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే వాటిని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
35
ఈ ఫార్ములా ఉపయోగించండి
పొదుపు చేయడం అంటే లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. జీతం వచ్చిన వెంటనే ఇంటి అవసరాల (ఆహారం, అద్దె, కరెంట్ వంటివి) కోసం 40 శాతం పక్కన పెట్టండి. 20 శాతం ఇష్టమైన వాటి కోసం (డిన్నర్లు, షాపింగ్, సినిమాలు), 20 శాతం అప్పులు, ఇతర పెట్టుబడుల కోసం, మరో 20 శాతం పొదుపు కోసం పక్కన పెట్టుకోవాలి. పొదుపు డబ్బులను మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.
లేట్ ఫీజులు
లేట్ ఫీజులు అంటే… మనం ఊరికే డబ్బులు చెల్లించడే. కాబట్టి టైంకి బిల్లులు చెల్లించండి. లేదా ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు తేదీ మర్చిపోయినా అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
పెద్ద ఖర్చుల కంటే చిన్న చిన్న ఖర్చులే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి చిన్న ఖర్చులపై దృష్టి పెట్టండి. అనవసరమైన రీఛార్జ్ లు, ఉపయోగించని యాప్ సబ్‌స్క్రిప్షన్, ఇంట్లో ఫుడ్ ఉన్నప్పుడు.. బయటి నుంచి ఆర్డర్ పెట్టుకోవడం వంటివి మానేయండి. దానివల్ల కొన్ని డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. వర్క్ ప్లేస్ కు సంబంధించి.. హెల్త్ ఇన్సూరెన్స్, మీల్ కూపన్ల వంటివి ఉపయోగించుకోండి. దానివల్ల వాటికోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
55
క్రెడిట్ కార్డు బిల్
ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్ బిల్ పూర్తిగా చెల్లించగలిగితే.. క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్స్ వంటివి పొందే అవకాశం ఉంటుంది. వాటిని ట్రై చేయండి. అంతేకాదు చాలా బ్యాంక్ యాప్‌లు మీ కొనుగోళ్లను రౌండ్ అప్ చేసి, మిగిలిన చిల్లరను సేవింగ్స్‌లో దాస్తాయి. ఉదాహరణకు రూ. 93 కి ఒక కాఫీ కొన్నారనుకోండి. మిగిలిన 7 రూపాయలు మీ సేవింగ్స్‌లోకి వెళ్తుంది.
సేవింగ్స్ అకౌంట్ మంచిదే. కానీ అది మీ డబ్బును పెద్దగా పెంచదు. దానిలో కొంత భాగాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి తక్కువ రిస్క్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయండి. తద్వారా మీ డబ్బు పెరుగుతూ పోతుంది.