Dmart Online Shopping: డీమార్ట్ షాప్‌కెళ్ళి సరుకులు కొనే కన్నా డీమార్ట్ ఆన్‌లైన్లో కొంటె ఇంకా తక్కువ రేట్లకే సరుకులు వస్తాయ్

Published : Aug 12, 2025, 01:07 PM IST

ఎవరైనా సరుకులు కావాలంటే మొదట గుర్తొచ్చేది డీమార్ట్. నెలవారీ సరుకులను ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటారు. డీమార్ట్ షాప్ లో తక్కువ ధరకే వస్తాయని అలా చేస్తారు. నిజానికి డీమార్ట్ షాప్ కన్నా డిమార్ట్ ఆన్లైన్ లోనే తక్కువ ధరకే సరుకులు లభిస్తాయి. 

PREV
15
మధ్యతరగతి వారికోసమే డీమార్ట్

నెలవారీ సరుకుల కోసం డీమార్ట్ కి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. శని, ఆదివారాలు వస్తే డిమార్ట్ లో ఇసుకరాలనంత జనం కనిపిస్తారు. ఎందుకంటే బయట మార్కెట్లో కన్నా డీమార్ట్‌లో చాలా తక్కువ ధరకే సరుకులు లభిస్తాయి. అందుకే సామాన్యుల నుంచి సంపన్నల వరకు డీమార్ట్ స్టోర్లకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసమే ఈ డిమార్ట్ స్టోర్లు ఏర్పాటు చేశారా అన్నట్టు ఉంటుంది. డిమార్ట్ లో ఎక్కువ మంది వినియోగదారులు కూడా మధ్యతరగతి ప్రజలే. పండుగ సీజన్లో వెళితే ఆ స్టోర్ లో కనీసం అడుగు కూడా పెట్టలేము. అంతగా బిజినెస్ అవుతుంది.

25
ఆర్డర్ పెట్టేయండి

డీమార్ట్ స్టోరు కొంతమంది నివాస ప్రాంతాలకు దూరంగా ఉండవచ్చు. అలాంటివారు ప్రతిసారి డీమార్ట్ కి వెళ్లేందుకు కష్టపడాల్సి వస్తుంది. అయితే డిమార్ట్ స్టోర్ కే కాదు డిమార్ట్ ఆన్లైన్ పోర్టల్ లో కూడా మీరు సరుకులను తక్కువ ధరకే కొనవచ్చు. నిజం చెప్పాలంటే డీమార్ట్ స్టోర్ కన్నా కూడా డిమార్ట్ ఆన్లైన్ లోనే తక్కువ ధరకు లభిస్తాయి. ఒక్కోసారి ప్రత్యేక సేల్ నడుస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇంకా తక్కువ ధరలకు ఎక్కువ సరుకులను కొనుక్కోవచ్చు. నేరుగా ఇంటికే డెలివరీ బాయ్‌లు సరుకులను అందజేస్తారు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది.

35
డిమార్ట్ రెడీ

డిమార్ట్ ఆన్లైన్ స్టోర్‌ను డీమార్ట్ రెడీ అని పిలుస్తారు. డీమార్ట్ ఆన్లైన్, ఆఫ్ లైన్... రెండింటిలోనూ తక్కువ ధరల్లో సరుకులను అందించేందుకే ప్రయత్నిస్తారు. డిమార్ట్ ఆన్లైన్ పోర్టల్ లో బయట స్టోర్లలో అందుబాటులో లేని ప్రత్యేకమైన వస్తువులు, డిస్కౌంట్లు, ఆన్లైన్ ప్రమోషన్లు కూడా ఉంటాయి. వాటిలో మీకు తక్కువ ధరకే సరుకులు వచ్చే అవకాశం ఉంది. అయితే డెలివరీ, ప్యాకేజింగ్ వంటివి ఖర్చులు అదనంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి ఖర్చును చెల్లించాల్సి రావచ్చు.

45
జియో మార్ట్ తో పోటీ

ఇప్పుడు డీమార్ట్ కు పోటీగా జియో మార్ట్ కూడా సిద్ధమైంది. డీమార్ట్ తో పోలిస్తే మరింత తక్కువ ధరలకు వస్తువులను అందించాలన్న ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎంతోమంది డిమార్ట్ నుంచి జియో మార్ట్ కు మారారు కూడా. అయితే రెండిట్లోనూ సరుకులు నాణ్యత అధికంగానే ఉంది. రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి అవి వీలును బట్టి మీరు ఏ స్టోర్ నుంచి ఆన్లైన్లో లేదా ఆఫ్ లైనులో కొనుగోలు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చు. ఏదేమైనా మధ్య తరగతి ప్రజలకు డిమార్ట్, జియో మార్ట్ వంటివి వరాలనే చెప్పాలి.

55
డిమార్ట్ చరిత్ర

ఈ స్టోర్ ను రాధాకిషన్ దమాని ప్రారంభించారు. 2002లో దీన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు మనదేశంలో 234 స్టోర్లు డీమార్ట్ స్టోర్లు ఉన్నాయి. అతితక్కువగా రిటైల్ ధరకే సరుకులు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ ఎంతో నాణ్యమైనవి. బ్యూటీ ఉత్పత్తుల నుంచి బాత్ రూమ్ వస్తువులు వరకు ఇక్కడ లేని ఉత్పత్తి లేదు. దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, పాత్రలు ఇలా అన్నీ లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories