Gold Price: భారీగా ప‌త‌నంకానున్న బంగారం ధ‌ర‌.. కార‌ణం ఏంటో తెలుసా.?

Published : Aug 10, 2025, 10:55 AM IST

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సుంకాల విధింపు యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ముఖ్యంగా భార‌త్‌పై 50 శాతం సుంకాలు విధించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే దీంతో భార‌త్‌కు ఎంత న‌ష్ట‌మో అమెరికాకు అంతే న‌ష్టం ఉంద‌ని మీకు తెలుసా.? 

PREV
15
అమెరికా సుంకాలతో భార‌త్‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంది

అమెరికా, భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న పలు కీలక ఉత్పత్తులపై 50% వరకు కొత్త సుంకాలు విధించింది. ఈ “పన్నుల ఆట” నేరుగా భారత ఆర్థిక వ్యవస్థను, అంతర్గత మార్కెట్ ధరలను ప్రభావితం చేయనుంది. Global Trade Research Initiative వెల్లడించిన 2024–25 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం, అమెరికా భారత ఎగుమతుల్లో పెద్ద భాగం కలిగి ఉంది. ముఖ్యంగా బంగారం, వజ్రాలు, సంబంధిత ఉత్పత్తులు రూ.83,000 కోట్ల విలువలో ఎగుమతి అవుతున్నాయి. వీటిపై 52.1% సుంకం విధించడం వల్ల అమెరికాలో ధరలు పెరిగే అవకాశం ఉంది.

25
ఏ ఉత్పత్తులపై ఎంత సుంకం?

* స్మార్ట్‌ఫోన్లు – రూ.87,980 కోట్లు (తాత్కాలిక మినహాయింపు, సుంకం లేదు)

* యంత్రాలు, మెకానికల్ పరికరాలు – రూ.55,610 కోట్లు (51.3% సుంకం)

* ఇనుము, అల్యూమినియం, వెండి వంటి లోహాలు – రూ.38,810 కోట్లు (51.7% సుంకం)

* టెక్ట్స్‌టైల్ ఉత్పత్తులు – రూ.24,900 కోట్లు (59% సుంకం)

* నేసిన దుస్తులు – రూ.22,410 కోట్లు (60.3% సుంకం)

* రసాయన ఉత్పత్తులు – రూ.22,410 కోట్లు (54% సుంకం)

* వాహనాలు, విడిభాగాలు – రూ.21,580 కోట్లు (26% సుంకం)

* రొయ్యలు – రూ.16,600 కోట్లు (50% సుంకం)

* చెక్క, మంచం ఉత్పత్తులు – రూ.9,130 కోట్లు (52.3% సుంకం)

35
అమెరికాలో ధరలు పెరగబోయే ఉత్పత్తులు

ఈ కొత్త సుంకాల కారణంగా అమెరికాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, దుస్తులు, లోహ ఉత్పత్తులు, వాహన విడిభాగాలు వంటి వాటి ధరలు పెరుగుతాయి. దిగుమతి వ్యయం పెరగడం వల్ల అక్కడి మార్కెట్‌లో అమ్మక ధరలు కూడా పెరిగిపోతాయి.

45
భారత మార్కెట్‌లో ధరలు తగ్గే ఉత్పత్తులు

అమెరికాలో ధరలు పెరగడంతో, ఆ దేశం భారత్ నుంచి కొనుగోలు చేసే పరిమాణం తగ్గవచ్చు. దీని వల్ల భారత మార్కెట్‌లో బంగారం, వజ్రాలు, దుస్తులు ఎక్కువగా లభిస్తాయి. ఫలితంగా దేశీయ ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు తాత్కాలికంగా పడిపోవచ్చు. కొంతమంది నిపుణుల అంచనా ప్రకారం, రానున్న రోజుల్లో బంగారం ధ‌ర భారీగా త‌గ్గ‌నుంద‌ని చెబుతున్నారు.

55
బంగారం కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యమా.?

బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌యమ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఈ త‌గ్గుద‌ల ఎక్కువ కాలం కొన‌సాగ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. దేశీయ డిమాండ్‌ పెరిగితే మళ్లీ ధరలు అంతే వేగంతో ఎగబాకే అవకాశం ఉంది. కాబట్టి, తక్కువ కాలంలో ధరలు పడిపోతున్నప్పుడు పెట్టుబడిదారులు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తంగా.. అమెరికా సుంక విధానం వ‌జ్రాలు, బంగారం, వెండి, దుస్తులు వంటి ఉత్పత్తుల అంతర్జాతీయ ధరలను, భారత మార్కెట్ ధరలను మార్చే అవ‌కాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories