AI Impact Warning: AI సునామీ.. 2027 నాటికి వారి జీవితాల్లో సంక్షోభం తప్పదా? గూగుల్ మాజీ ఏమన్నారంటే?

Published : Aug 09, 2025, 12:35 PM IST

AI Impact Warning: 2027 నాటికి AI కారణంగా మధ్యతరగతి వర్గం ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్  గౌదత్ (Mo Gawdat) హెచ్చరించారు. ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం కలిసి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

PREV
15
ఏఐ సునామీ

AI Impact Warning: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతున్నది. AI ప్రభావం సాంఘిక, ఆర్థిక రంగాల్లో విపరీత మార్పులు వస్తున్నాయి. అయితే.. మధ్యతరగతి వర్గం జీవన విధానంపై ఈ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపుతుందనే ఆందోళన ఉన్నాయి. ఉద్యోగా అవకాశాలపై ప్రభావం పడుతుందని చాలా మందికి అపోహాలున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలు నిజమే అన్నట్టు గూగుల్ మాజీ సీఈఓ అధికారి, Google X ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా మొ గౌదత్ (Mo Gawdat) షాకింగ్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో 2027 నాటికి AI కారణంగా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవటం, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయనీ, మధ్యతరగతి ప్రజల సంక్షోభంలో పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంకా ఎలాంటి హెచ్చరికలు, సూచనలు చేశారో ఓ లూక్కేయండి. 

25
2027 నాటికి సంక్షోభం

 ఇటీవల గూగుల్ మాజీ సీఈఓ అధికారి, Google X ఛీఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మొ గౌదత్ (Mo Gawdat) ‘డైరీ ఆఫ్ ఎ సీఈఓ’ అనే పాడ్కాస్ట్‌లో భయంకరమైన నిజాలను చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. 2027 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆటోమేషన్ కారకంగా, మధ్యతరగతి వర్గంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ మార్పు వల్ల ఉద్యోగాల భవిష్యత్తు ముప్పుగా మారుతుందని, చావుకు ముందు నరకం లాంటి పరిస్థితి ఏర్పడబోతుందన్నారు.

35
ఈ రంగాలు ప్రమాదంలో

మొ గౌదత్ (Mo Gawdat) తన స్వంత AI ఆధారిత స్టార్టప్ Emma.love గురించి వివరించారు. గతంలో 350 మందికి పైగా డెవలపర్లు పని చేసిన ఈ సంస్థ ప్రస్తుతం కేవలం ముగ్గురు వ్యక్తులతో నడుస్తోంది. ఈ ఉదాహరణ ద్వారా AI వలన పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఎలా తగ్గుతున్నాయో స్పష్టమవుతుందని తెలిపారు. అలాగే, “పాడ్కాస్టర్లు కూడా రిప్లేస్ అవుతారని, పలు జాబ్స్ పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని తెలిపారు.

45
టాప్ 0.1 శాతంలో లేకపోతే అంతే..

ఏఐ సునామీతో ఆర్ధిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్ మాజీ గౌదత్ (Mo Gawdat)సూచించారు. గతంలో పారిశ్రామిక విప్లవం మాన్యువల్ ఉద్యోగాలను తొలగించినట్టు, ఈసారి AI విద్యావంతులైన, సెక్యూరిటీ ఉన్న ఉద్యోగాలను లక్ష్యంగా చేస్తుందని చెప్పారు. “మీరు టాప్ 0.1 శాతంలో లేకపోతే, మీ జీవితం సంక్షోభంలో ఉన్నట్లే అని అని ఆయన హెచ్చరించారు. అంటే మధ్యతరగతి వర్గం పూర్తిగా లేకుండా పోవడం సమాధానమని అర్థమవుతుంది.

55
సామాజిక అసమతుల్యత, మానసిక సమస్యలు

AI వ్యాప్తి వల్ల ఉద్యోగాలు కోల్పోవడంతో సామాజిక అసమతుల్యత, ఒంటరితనం, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని గౌదత్ పేర్కొన్నారు. వ్యక్తులు తమ ఉద్దేశ్యాన్ని కోల్పోగా, మానసిక సంక్షోభాలు, విరక్తి, సామాజిక అసహనాలు వృద్ధి చెందుతాయని హెచ్చరించారు. ఈ పెద్ద మార్పులు 2027 నాటికి ప్రారంభమై, మధ్యతరగతిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని మొ గౌదత్ అంచనా వేశారు. ప్రభుత్వాలు, వ్యాపార రంగం కలిసి సరికొత్త విధానాలతో మధ్యతరగతి ఉద్యోగాల రక్షణ చర్యలు తీసుకోవాలనీ, లేకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రంగా మారిపోతుందని హెచ్చరించారు.

Read more Photos on
click me!

Recommended Stories