1. ఫైనాన్సియల్ విషయాలపై క్లారిటీ..
మనలో చాలా మంది చేసే తప్పేంటంటే లెక్కలు వేసుకోకుండా ఖర్చులు చేయడం. మీరు అలా చేయకుండా ఆదాయం, ఖర్చులు, అప్పుల వివరాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మన కెపాసిటీకి మించి అప్పులు చేస్తుంటాం. అలాగే చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేస్తుంటాం. ఇలాంటివన్నీ లెక్కలేసుకొని మొత్తం ఎన్ని అప్పులు ఉన్నాయో క్లియర్ గా రాసుకోండి. అదేవిధంగా మీరు ఉద్యోగులయితే జీతం ఎంత వస్తుంది. ఇతర ఇన్ కమ్ సోర్సస్ ఏమైనా ఉన్నాయా లేదా అన్న విషయాలపై క్లారిటీ తెచ్చుకోండి. దీంతో మొత్తం ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అన్న విషయాలపై మీకు పూర్తి అవగాహన వస్తుంది.
2. ముందు తీర్చాల్సిన అప్పలను గుర్తించండి
ఫస్ట్ మీకు ఎన్ని రకాల అప్పులు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. అధిక వడ్డీ ఉన్న అప్పులను మొదట తీర్చడం ముఖ్యం. వడ్డీ రేటు ఎక్కువగా ఉన్న అప్పులను తొలగించడం ద్వారా భారం తగ్గుతుంది. అదేవిధంగా త్వరగా తీర్చాల్సిన అప్పులపైనా దృష్టి పెట్టండి. మీకు అప్పు ఇచ్చిన వాళ్ల అవసరాలను కూడా గుర్తించి తీరుస్తామని మాటిచ్చిన సమయానికి అప్పు తీర్చేలా ప్రయత్నించండి. లేకపోతే మీపై నమ్మకం పోతుంది. మళ్లీ ఏదైనా అవసరమై అప్పు అడిగితే ఇవ్వరు.
3. అదనపు ఆదాయ మార్గాలు కనిపెట్టండి
మీ రెగ్యులర్ ఆదాయానికి తోడు సైడ్ ఇన్కమ్ జెనరేట్ చేయడం ద్వారా అప్పులు వేగంగా తీర్చుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ మీకు ఎంత ఫ్రీ టైమ్ దొరుకుతోందో తెలుసుకోండి. ఆ సమయంలో ఏ వర్క్ చేస్తే అదనపు ఆదాయం వస్తుందో తెలుసుకోండి. ఈ రోజుల్లో వర్క్ ప్రం హోం జాబ్స్ ఎన్నో అందుబాటులో ఉంటున్నాయి. మీ క్వాలిఫికేషన్‌కు తగిన జాబ్‌ను ఎంచుకోండి. మీరు చేయగలిగిన వాటినే ఎంచుకోండి. తక్కువ టైం లో ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోండి.
ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. మీకు బిజినెస్ చేసే ఆలోచన ఉంటే మీరే వాటిని ప్రారంభించండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలానే చేయవచ్చు. అలాంటి వాటిపై దృష్టి పెట్టండి. మీరు చేయలేని పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉండే కుటుంబసభ్యులను పెట్టి నడిపించండి.
4. ఖర్చులను తగ్గించుకోండి..
అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు ఎక్కువ మొత్తంలో అప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులంటే సందర్భం లేకపోయినా బట్టలు కొనుక్కోవడం, అవసరం లేకపోయినా ట్రావెలింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవడం లాంటివన్న మాట. వీటి వల్ల డబ్బులు ఖర్చు అవ్వడమే తప్ప ఎటువంటి లాభం రాదు. ముఖ్యంగా అప్పులు తీరేంత వరకు ఇలాంటి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం అవసరం.
5. కన్సాలిడేషన్ చేసుకోవడం
మీరు తీసుకున్న రకరకాల అప్పులను కన్సాలిడేట్ చేసి ఒకే రకమైన అప్పుగా మార్చుకోవడం ద్వారా వడ్డీ రేట్ల భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఓ బ్యాంకులో మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారనుకుందాం. వేరే బ్యాంకులో కారు లోన్ తీసుకున్నారనుకోండి. వీటిని ఆయా బ్యాంకులు విడివిడిగా వడ్డీరేట్లు వేస్తాయి. సాధారణంగా పర్సనల్ లోన్‌కు 14 శాతం వరకు వడ్డీ విధిస్తారు. అందువల్ల ఈ రెండు లోన్లను కలిపి ఒకే బ్యాంకులోకి మార్చుకొనే సదుపాయం కొన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. అలాంటి వాటిని గుర్తించి ఒక బ్యాంకులోనే రెండు అప్పలను కలిపే సదుపాయాన్ని ఎంచుకొని వడ్డీ రేట్ల భారాన్ని తగ్గించుకోండి.
6. సిస్టమేటిక్ ప్లాన్ రూపొందించుకోండి
ప్రతినెలా ఎంత మొత్తంలో అప్పు తీర్చాలని ముందుగానే నిర్ణయించుకోండి. ఆ ప్రణాళికను క్రమం తప్పకుండా పాటించండి. దీని కోసం మీ ఆదాయ ఖర్చులపై మీకు క్లారిటీ ఉండాలి. ఉదాహరణకు 100 రూపాయలు సంపాదిస్తుంటే ఇంటి అవసరాలకు కొంత, హాస్పిటల్ ఖర్చులకు కొంత ఏ విధంగా పక్కన పెడతామో అదే విధంగా అప్పలు తీర్చడానికి కూడా ప్రతినెల కొంత మొత్తాన్ని పక్కన పెట్టాలి. ఇలా సిస్టమాటిక్‌గా లెక్కలు వేసుకొంటే అప్పుల భాధలు భారంగానే అనిపించవు. కొన్నాళ్లకు మనకు తెలియకుండానే మన అప్పులు స్పీడ్‌గా తగ్గిపోతాయి.
7. అత్యవసరమైతేనే కొత్త అప్పులు చేయండి
అప్పులు తీరుతున్నాయి కదా అని మళ్లీ అప్పు మీద అప్పు చేయకండి. ఇప్పటికే అప్పులు భారంగా మారాయంటే ఎంత ఎమర్జెన్సీలో ఇలా అప్పులు చేశామో ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోండి. ఇక కొత్త అప్పులు చేయాల్సిన అత్యవసర సమయం ఎదురైతే తప్ప మళ్లీ అప్పు జోలికి వెళ్ల వద్దు. లేదంటే అప్పుల భారం తట్టుకోలేక అనవసర ఆలోచనలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది యువత ఇలాగే అప్పు మీద అప్పు చేసి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.