మగధీర రికార్డ్స్ ఫేక్, అల్లు అరవింద్ మోసాన్ని బయట పెట్టిన రాజమౌళి! ఇంత జరిగిందా?

First Published | Nov 22, 2024, 2:49 PM IST

ఇండస్ట్రీ హిట్ మగధీర రికార్డ్స్ కూడా ఫేక్ అని   తేల్చేశాడు రాజమౌళి. అల్లు అరవింద్ చేసిన మోసాన్నిబయటపెట్టారు. రాజమౌళి ఇంతకీ ఏమన్నారు. 
 

Rajamouli

రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మగధీర. రాజమౌళి-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఇది. చిరుత మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రామ్ చరణ్... రెండో చిత్రం రాజమౌళితో చేశారు. సోషియో ఫాంటసీ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది.  పునర్జన్మల నేపథ్యం కావడంతో రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో అలరించాడు.

2009లో మగధీర విడుదలైంది. టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టింది. మగధీర నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ బడ్జెట్ విషయంలో ఆందోళనకు గురయ్యాడట. మగధీర రికవరీ చేయగలదా అని టెన్షన్ పడ్డారట. 

ఉన్నది మొత్తం ఈ సినిమాకు పెట్టేశానని ఆయన రాజమౌళితో అంటుండేవారట. మగధీర ఇండస్ట్రీ హిట్ కావడంతో అల్లు అరవింద్ కి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. అంత భారీ హిట్ ఇచ్చిన రాజమౌళికి అల్లు అరవింద్ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదట. మరోవైపు చిరంజీవి మగధీర హిట్ కావడానికి కేవలం రామ్ చరణ్ కారణం అన్నట్లు మాట్లాడేవారట. 
 

Latest Videos


అల్లు అరవింద్, చిరంజీవి తీరుకు విసిపోయిన రాజమౌళి.. మెగా హీరోలతో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడనే వాదన కూడా ఉంది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో రాజమౌళి ఒక్క సినిమా కూడా చేయలేదు. అందుకు మగధీర సినిమా సమయంలో తలెత్తిన విబేధాలే కారణం అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. 

 ఆ విషయం పక్కన పెడితే మగధీర రికార్డ్స్ సైతం కొన్ని ఫేక్ అని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రతి స్టార్ హీరో హిట్ సినిమాకు 100  డేస్ థియేటర్స్ నెంబర్స్  పెంచి  వేసుకునేవారు. ఇది అందరూ చేసేవారు. చాలా చిరాకు తెప్పించేది. సింహాద్రి కొన్ని థియేటర్స్ లో వందరోజులు ఆడింది. అది జెన్యూన్ గా ఆడింది. అందరం ఆనందపడ్డాం. 

Magadheera

అక్కడితో ఆగకుండా 175 డేస్ ఆడాలని చెప్పి ఇంకో 10-15 థియేటర్స్ లో ఆడించారు. అది నాకు నచ్చలేదు కాదు. మనం సక్సెస్ కొట్టాం. దాన్ని ఎంజాయ్ చేయకుండా, కాని దాని ఓన్ చేసుకోవడం ఎందుకు అనిపించింది. అల్లు అరవింద్ తో నేను మగధీర స్టార్ట్ చేయబోయే ముందు ఈ టాపిక్ చర్చకు వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడో ఒక చోట పుల్స్టాప్ పెట్టాలి, అన్నాను. దానికి అవును అలా మనం చేయొచ్చు అనుకున్నాం.

మగధీర ఇండస్ట్రీ హిట్. అప్పటి రికార్డ్స్ కి రెండింతల వసూళ్లు ఆ చిత్రం వసూలు చేసింది. ఆల్ టైం కి డబుల్ హిట్ అది. ఆ సినిమాకు దరిదాపుల్లో మరో సినిమా లేదు. 100 డేస్ కి మళ్ళీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచడం మొదలుపెట్టారు. నేను అరవింద్ తో మనం ఈ బ్యాడ్ కల్చర్ ఆపేద్దాం అనుకున్నాం కదా సర్ అన్నాను. అవును కానీ, అభిమానుల ఒత్తిడి, తప్పలేదు అన్నారు, అని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజమౌళి మాటలతో మగధీర 100 డేస్ థియేటర్స్ రికార్డు ఫేక్. అలాగే సింహాద్రి 175 డేస్ రికార్డు ఫేక్. ప్రతి హిట్ సినిమా రికార్డ్స్ లో కొన్ని ఫేక్ అని రుజువైంది..

click me!