cracked heels
చలికాలం వచ్చిందంటే చాలు లేనిపోని సమస్యలు వస్తూనే ఉంటాయి. జలుబు తర్వాత దగ్గు, దగ్గు తర్వాత జ్వరం ఇలా ఒకటి తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటితో పాటుగా చలికాలంలో ఖచ్చితంగా వచ్చే మరో సమస్య మడమల పగుళ్లు.
ముఖ్యంగా చలికాలంలో మడమల పగుళ్ల వల్ల ఆడవాళ్లే ఎక్కువగా ఇబ్బంది పడతారు. మడమల పగుళ్లు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ దీనివల్ల పాదాలు విపరీతంగా నొప్పి పుడతాయి. దీనివల్ల నడవడం కూడా కష్టంగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. అంతేకాకుండా ఈ పగుళ్లు ఎక్కువగా ఉంటే వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. అందుకే చలికాలంలో మడమల పగుళ్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
క్లీనింగ్ చాలా ముఖ్యం
క్లీనింగ్ లేకపోవడం వల్ల మడమల పగుళ్లు ఎక్కువగా వస్తాయి. అవును రోజూ వీటిని క్లీన్ చేయకపోవడం వల్ల దుమ్ము, ధూళి కాళ్లకు ఎక్కువగా పట్టుకుని మడమల పగుళ్లు వస్తాయి. అందుకే మీరు ఎక్కడికి వెళ్లొచ్చినా.. ఇంటికి రాగానే మీ పాదాలను బాగా కడుక్కోండి. దీనివల్ల పగుళ్లు ఏర్పడవు. ఉన్న పగుళ్లు పెద్దగా కావు. తొందరగా తగ్గిపోతాయి.
వేడి నీటిని వాడండి
పగిలిన మడమలు తగ్గిపోవాలంటే మాత్రం మీరు గోరువెచ్చనినీళ్లను వాడాలి. అవును గోరు వెచ్చని నీళ్లతో పాదాలను శుభ్రం చేస్తే మీ పాదాలు అందంగా ఉంటాయి. ఎందుకంటే ఈ వాటర్ పాదాల చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. అలాగే పగిలిన మడమలు తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది.
తేనె వాడండి
తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా ఇది మడమల పగుళ్లను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. మీరు చలికాలంలో మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి తేనెను ఉపయోగిస్తే సరిపోతుంది.
cracked heels
ఇందుకోసం ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. దీనిలో ఒక కప్పు తేనెను కలపండి. ఈ వాటర్ లో మీ పాదాలు 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లలోంచి పాదాలను బయటకు తీసి ప్యూమిస్ స్టోన్ తో పాదాలను రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో పాదాలను కడగండి.
మాయిశ్చరైజ్ అప్లై చేయాలి
పాదాలను శుభ్రం చేసిన తర్వాత మెత్తని టవల్ తో బాగా తుడవండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ను మడమలకు, పాదాలకు పెట్టండి. ఈ మాయిశ్చరైజర్ పగిలిన మడమలను తగ్గిస్తుంది. పాదాలను అందంగా మారుస్తుంది. చలికాలంలో పగిలిన మడమలను తగ్గించుకోవడానికి, చర్మం మృదువుగా మారడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనెను అప్లై చేయండి.