జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయింది

First Published | Nov 22, 2024, 3:17 PM IST

BSNL తన పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్లాన్‌ను చేర్చింది. ఇది జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీని ఇస్తుందనడంలో సందేహం లేదు. కొత్త ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీని అందించడమే కాకుండా అధిక డేటా వినియోగాన్ని కూడా అందిస్తోంది. మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. టెలికాం మార్కెట్‌లో BSNL బలమైన పోటీదారుగా నిలిచేందుకు కొత్త టారిఫ్ ప్లాన్ కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి. 

ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, మరియు వీఐలకు పోటీగా, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవలి నెలల్లో బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. అంతేకాకుండా భారతదేశం అంతటా 4G సేవలను విస్తరించింది. ఇలాంటి అనేక కస్టమర్ సెంట్రిక్ చర్యలను అమలు చేసింది.

బీఎస్ఎన్ఎల్ తన పోర్ట్‌ఫోలియోలో రూ.1999 ప్లాన్‌ను చేర్చింది. ఇది జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీని ఇవ్వనుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ కోసం చూస్తున్న వారికి ఆకర్షణీయమైన ఎంపిక అని చెప్పొచ్చు. బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 1999 రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఎక్కువ వ్యాలిడిటీ వస్తుంది. అంతేకాకుండా విలువైన ఇతర ఆఫర్లు కూడా ప్రకటించింది. ఈ ప్లాన్ కస్టమర్లకు ఒక సంవత్సరం పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. దీంతో మీరు నెలనెలా రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. 


ఈ రీఛార్జ్ ఆఫర్ మీరు వేయించుకుంటే ఒక్క బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కే కాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత వాయిస్ కాల్స్ సంవత్సరం పాటు ఉచితంగా చేసుకోవచ్చు. దీంతో పాటు ఏడాది మొత్తానికి 600 GB డేటా వస్తుంది. ఈ డేటాను రోజుకు ఇంత అని లిమిటెడ్ గా వాడాల్సిన అవసరం లేదు. 600 GBని మీరు కంటిన్యూగా వినియోగించుకోవచ్చు. ఈ డేటా మీరు సంవత్సరం పొడవునా ఉపయోగించినా లేదా కొన్ని వారాల్లోనే ఉపయోగించినా మీకు ఎలాంటి లిమిట్స్ ఉండవు. 

అంతే కాకుండా ఒక రోజుకు 100 ఉచిత SMSలు, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, కేమియన్ & ఆస్ట్రోటెల్, కేమియం, జింగ్ మ్యూజిక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ అందరిలోనూ మంచి ఆదరణ పొందింది.

ఇవే కాకుండా బీఎస్ఎన్ఎల్ 1515తో సంవత్సర కాలం పాటు రోజుకు 2 జీబీ డాటాను ఇస్తూ మరో ఇయర్లీ ప్లాన్ అందిస్తోంది. కేవలం రూ.321తో రీఛార్జ్ చేసుకుంటే 15 జీబీ డాటా లభిస్తుంది. దీన్ని కూడా సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా వాడుకోవచ్చు. 

Latest Videos

click me!