ఒక్క బిట్ కాయిన్ ఉంటే.. మీ దగ్గర కోటిరూపాయలున్నట్లే

Published : Nov 12, 2024, 09:21 AM ISTUpdated : Nov 12, 2024, 12:24 PM IST
ఒక్క బిట్ కాయిన్ ఉంటే..  మీ దగ్గర కోటిరూపాయలున్నట్లే

సారాంశం

బిట్ కాయిన్ పరుగులు తీస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏడాది చివరికల్లా లక్ష డాలర్లకు చేరుకునే అవకాశం వుందని అంచనా.  

బిట్ కాయిన్ మరోసారి భారీగా పెరిగింది.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత క్రిప్టో కరెన్సీ పరుగులు పెడుతోంది. హయ్యెస్ట్ 89,174 డాలర్లుగా వున్న క్రిప్టో కరెన్సీ తాజాగా సోమవారం మరింత పెరిగి ఆల్ టైమ్ హై 89,623 డాలర్లకు చేరుకుంది. 

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత క్రిప్టో కరెన్సీకి సంబంధించి పలు హామీలిచ్చారు. అమెరికాలో బిట్ కాయిన్ వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు... దేశాన్ని క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ప్లానెట్ గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా క్రిప్టో ఇండస్ట్రీలో జోష్ పెరిగి ఆల్ టైమ్ రికార్డులు నమోదవుతున్నాయి. 

ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ జోరును చూసి ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బిట్ కాయిన్ ఈ ఏడాది చివరికల్లా $1,00,000 కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 1 కోటి టర్మ్ పాలసీ: మీ కుటుంబానికి సరైన ఆర్థిక భద్రత ఇదేనా?
Indian Railway: బ్యాట‌రీ వాహ‌నాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేష‌న్‌లో మీకు తెలియ‌ని ఎన్నో సౌక‌ర్యాలు