Budget Friendly Cars : కొత్తగా జాబ్ లో చేరినవారు కూడా కొనగలిగే టాప్ 5 కార్లు ఇవే..

Published : Jan 17, 2026, 10:52 AM IST

Top 5 Budget Friendly Cars : ఈ రోజుల్లో తక్కువ సంపాదన కలిగినవాళ్లు కూడా కారు కొనడం పెద్ద కష్టమేమీ కాదు. మొదటి ఉద్యోగంలో చేరినవాళ్లైనా, రోజూ ఆఫీసుకు వెళ్లేవాళ్లైనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా తక్కువ ధరలో మంచి మైలేజ్ కారు కావాలని కోరుకుంటున్నారు.  

PREV
16
తక్కువ ధరకే లభించే బెస్ట్ కార్లు..

ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల మధ్య మధ్యతరగతి కుటుంబాల అవసరాలు కూడా మారుతున్నాయి. రోజువారీ ప్రయాణానికి ఉత్తమంగా ఉండి, జేబుపై ఎక్కువ భారం పడని కార్ల కోసం చాలామంది చూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీలు తక్కువ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్లు అందిస్తున్నాయి.

26
1. మారుతి ఆల్టో కె10 (Maruti Suzuki K10)

మారుతి సుజుకిలో తక్కువ ధరకే వచ్చే అనేక కార్లు ఉన్నాయి. ఇందులో అత్యంత చవకయినది ఆల్టో కె10... ఇది ఏళ్లుగా కస్టమర్ల మనసు దోచుకుంటోంది. ఇది నమ్మకమైన చిన్న కార్ల జాబితాలో ఉంది. తక్కువ ధర, సులభమైన నిర్వహణ దీని ప్రత్యేకత. ఈ ఆలొ K10 STD(O) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.69 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది బేసిక్ మోడల్... కాబట్టి మొదటిసారి కొనేవారికి ఇది మంచి ఎంపిక.

36
2. రెనో క్విడ్ (Renault Kwid)

లోబడ్జెట్, హై మైలేజ్ కార్ల జాబితాలో రెనో క్విడ్ కూడా ఉంది. ఇది ప్రస్తుతం భారత రోడ్లపై దూసుకుపోతూ కస్టమర్ల మనసు దోచుకుంటోంది. దీని ఎత్తైన లుక్, తక్కువ ధర మొదటిసారి కొనేవారిని ఆకట్టుకుంటున్నాయి. క్విడ్ 1.0 RXE వేరియంట్ ధర రూ. 4.29 లక్షలకు తగ్గింది. ఇది స్టైల్, బడ్జెట్‌కు సరైన జోడీ.

46
3. టాటా టియాగో (TATA Tiago)

టాటా మోటార్స్ తన దృఢమైన బాడీ పార్ట్స్‌కు ప్రసిద్ధి… టియాగో కూడా అలాంటిదే. బలమైన బాడీ, మెరుగైన భద్రత కారణంగా ఇది తక్కువ ధరలో ఉత్తమ ఎంపిక. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 లక్షలు. ఈ సెగ్మెంట్‌లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.

56
4. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuku S-Presso)

ఈ జాబితాలో మారుతి చౌక కార్లలో ఒకటైన ఎస్-ప్రెస్సో కూడా ఉంది. తక్కువ ధర కారణంగా ఇది బడ్జెట్ కొనుగోలుదారులలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. దీని STD(O) వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.49 లక్షలు మాత్రమే. మొదటిసారి కొనేవారికి ఇది మంచి ఎంపిక.

66
5. మారుతి సెలెరియో (Maruti Suzuki Celerio)

మారుతి సెలెరియో కూడా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది సౌకర్యవంతమైన డ్రైవింగ్‌కు ప్రసిద్ధి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.69 లక్షలు. తక్కువ బడ్జెట్‌లో మన్నికైన, మంచి మైలేజ్ ఇచ్చే కారు కావాలంటే ఇది ఉత్తమ ఎంపిక.

Read more Photos on
click me!

Recommended Stories