MG Comet EV : ఎంజీ మోటార్స్ ఇండియా తన కామెట్ ఈవీ ధరలను రూ. 16,700 వరకు పెంచింది. ఇదే సమయంలో కంపెనీ బ్లాక్‌స్టోర్మ్ ఎఫ్‌సీ వేరియంట్ అమ్మకాలను శాశ్వతంగా నిలిపివేసింది.
MG Comet EV Price Hike: ఎంజీ నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ కారు వేరియంట్ అమ్మకాలు బంద్
ఎంజీ మోటార్స్ ఇండియా (MG Motors India) ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా పేరుగాంచిన ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) ధరలను కంపెనీ పెంచింది. అంతేకాకుండా, ఇందులో ఒక ప్రముఖ వేరియంట్‌ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
జనవరి 13 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెంపుతో పాటు, కారు లైనప్‌లో చేసిన మార్పుల గురించి పూర్తి వివరాలు గమనిస్తే..
26
ధరల పెంపు, నిలిపివేసిన వేరియంట్
ఎంజీ మోటార్స్ తన కార్ల ధరల పెంపులో భాగంగా కామెట్ ఈవీ ధరను కూడా సవరించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ కారు ధర రూ. 16,700 వరకు లేదా సుమారు 1.87% వరకు పెరిగింది. ఈ పెంపు తర్వాత, కామెట్ ఈవీ కొత్త ఎక్స్‌షోరూమ్ ధరలు రూ. 7.63 లక్షల నుండి ప్రారంభమై రూ. 10.0 లక్షల వరకు ఉన్నాయి.
ఇదే సమయంలో వినియోగదారులకు మరో వార్త కూడా ఉంది. కంపెనీ తన బ్లాక్‌స్టోర్మ్ ఎఫ్‌సీ వేరియంట్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. ఇకపై ఈ వేరియంట్ మార్కెట్లో అందుబాటులో ఉండదు.
36
కామెట్ ఈవీ డిజైన్, బాడీ కొలతలు
కామెట్ ఈవీ డిజైన్ పరంగా వూలింగ్ ఎయిర్ ఈవీ తరహాలో ఉంటుంది. ఇది చాలా కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉండి, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
పొడవు: 2974 మి.మీ
వెడల్పు: 1505 మి.మీ
ఎత్తు: 1640 మి.మీ
వీల్‌బేస్: 2010 మి.మీ
దీని టర్నింగ్ రేడియస్ కేవలం 4.2 మీటర్లు మాత్రమే. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లలో డ్రైవింగ్ చేయడం, ఇరకారు ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం చాలా సులభం. కారు ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, పూర్తి వెడల్పు ఉండే ఎల్ఈడీ స్ట్రిప్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. పెద్ద డోర్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఫ్లాట్ రియర్ సెక్షన్ దీనికి ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తాయి.
చిన్న కారు అయినప్పటికీ, ఎంజీ కామెట్ ఈవీలో ఫీచర్ల కొరత లేదు. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ను కారుతో పెయిర్ చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యూజిక్, నావిగేషన్, వాతావరణ సమాచారం, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ వంటి సౌకర్యాలను పొందవచ్చు.
ఈ కారు నాలుగు ప్రధాన రంగుల్లో లభిస్తుంది. అవి నీలం, ఆకుపచ్చ, సన్‌డౌనర్ (నారింజ), ఎరుపు.
56
కామెట్ ఈవీ ప్లాట్‌ఫామ్, సిటీ డ్రైవింగ్ కోసం..
కామెట్ ఈవీ GSEV ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది ప్రత్యేకంగా నగర ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీని కాంపాక్ట్ సైజు నగరాల్లో ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, కారు నిర్మాణం సున్నితంగా ఉండటం వల్ల కొన్ని భాగాలు కొంచెం బలహీనంగా కనిపించవచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, సిటీ రైడ్స్ కోసం ఇది మంచి ఎంపిక.
66
కామెట్ ఈవీ భద్రత, పనితీరు
భద్రత, పనితీరు విషయానికి వస్తే, కామెట్ ఈవీ కారులో 12-అంగుళాల చక్రాలు, 145/70 సైజు టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ పరంగా చూస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు. మొత్తంగా చూస్తే, ఎంజీ కామెట్ ఈవీ ధర పెరిగినప్పటికీ, దాని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సిటీ డ్రైవింగ్‌కు దీనిని ఒక మంచి ఎంపికగా నిలబెట్టాయి.