Tata Sierra : 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ తో దుమ్మురేపుతున్న టాటా కారు

Published : Mar 24, 2026, 09:46 PM IST

Tata Sierra Earns 5 Star Safety Rating : భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా సియెర్రా 5-స్టార్ రేటింగ్‌ సాధించింది. అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగాల్లో అత్యుత్తమ స్కోరుతో దేశంలోనే సేఫెస్ట్ SUVగా నిలిచింది.

PREV
16
దేశంలోనే సేఫెస్ట్ SUV Tata Sierra

భారతీయ ఆటోమొబైల్ రంగంలో రక్షణకు మారుపేరుగా నిలిచే టాటా మోటార్స్ మరో ఘనతను సాధించింది. ఐకానిక్ బ్రాండ్ 'టాటా సియెర్రా' (Tata Sierra) భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్టుల్లో సంచలనం రేపింది. ఈ ఎస్ యూవీ అత్యున్నతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ప్రయాణికుల భద్రతలో తనకు సాటిలేదని నిరూపించింది.

26
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో టాటా సియెర్రా కు బెస్ట్ స్కోరు

టాటా సియెర్రా పెద్దల రక్షణ విభాగంలో అసాధారణ రేటింగ్స్ తో దుమ్మురేపింది. మొత్తం 32 పాయింట్లకు గాను ఈ SUV 31.14 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో దీనికి 16 పాయింట్లకు గాను 15.14 పాయింట్లు లభించాయి. రిపోర్టుల ప్రకారం.. ప్రమాద సమయంలో డ్రైవర్ తల, మెడ, కాళ్ల పైభాగాలు, పాదాలకు రక్షణ అత్యద్భుతంగా ఉందని తేలింది. ఛాతీ భాగానికి లభించిన రక్షణ తగినంతగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టుల్లో కూడా తల, పొట్ట వంటి సున్నితమైన భాగాలకు గుడ్ రేటింగ్ లభించడం గమనార్హం.

36
చిన్నారుల భద్రతలోనూ టాటా సియెర్రాకు తిరుగులేదు

చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలోనూ సియెర్రా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 49 పాయింట్లకు గాను 44.73 పాయింట్లు ఈ కారుకు లభించాయి. టెస్టింగ్ సమయంలో 18 నెలలు, 3 ఏళ్ల పిల్లల డమ్మీలను వెనుకవైపు ముఖం ఉండేలా సీట్లలో ఉంచారు. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించినప్పుడు పిల్లల భద్రత విషయంలో ఈ కారుకు పూర్తి పాయింట్లు లభించడం విశేషం. దీనివల్ల కుటుంబంతో ప్రయాణించే వారికి ఇది అత్యంత సురక్షితమైన ఎంపికగా మారింది.

46
టాటా సియెర్రా లో ప్రామాణిక సేఫ్టీ ఫీచర్లు.. ADAS టెక్నాలజీ

టాటా సియెర్రాలోని అన్ని వేరియంట్లలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ తో కూడిన ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems), బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్రమాదం జరగక ముందే డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి.

56
టాటా సియెర్రా లో శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు

పనితీరు విషయంలో కూడా టాటా సియెర్రా వినియోగదారులకు మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది.

1. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.

2. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ : ఇది 160 hp పవర్, 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

3. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది మైలేజ్, పవర్‌ను సమతుల్యం చేస్తుంది.

ఈ పవర్‌ట్రెయిన్ పట్టణాల్లో సులువుగా ప్రయాణించడానికే కాకుండా, లాంగ్ డ్రైవ్‌లు, ఎగుడుదిగుడు రోడ్లపై కూడా అద్భుతమైన టార్క్‌ను అందిస్తుంది.

66
టాటా సియెర్రా ధర ఎంత? మార్కెట్ పోటీ ఎలా ఉంది?

భారత మార్కెట్లో టాటా సియెర్రా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షల నుండి రూ. 21.29 లక్షల వరకు ఉంది. ఈ SUV మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, మారుతి సుజుకి విక్టోరిస్ వంటి తోపు మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. అయితే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడంతో, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల మొదటి ఛాయిస్‌గా సియెర్రా నిలిచే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories