Published : Mar 24, 2026, 12:27 PM ISTUpdated : Mar 24, 2026, 12:37 PM IST
Telangana EV Policy : ఉద్యోగులకు సూపర్ ఛాన్స్. మీరు ఈవీ టూవీలర్ లేదా కారు కొనాలనుకుంటున్నారా..? ఇదే సరైన సమయం. భారీ డిస్కౌంట్ తో ఈ వాహనాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Telangana EV policy : కాలుష్య నియంత్రణ, సాంప్రదాయ ఇధన వనరులు (పెట్రోల్, డీజిల్) కొరతను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఈవీ పాలసీ' ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై భారీ డిస్కౌంట్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
25
ఉద్యోగులకు ఈవి వెహికిల్స్ పై 20 శాతం డిస్కౌంట్...
ఈవి పాలసీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్ ఇస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా చర్యలు చేపట్టింది. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనే ఉద్యోగులకు డిస్కౌంట్ ఇవ్వాలని తయారీ సంస్థలకు సూచించామని... కొన్ని సంస్థలు ఇందుకు అంగీకారం కూడా తెలిపాయన్నారు. ఇప్పటికయితే ప్రభుత్వ ఉద్యోగులకు 15-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు.
35
ఈవి వాహనాలపై డిస్కౌంట్...
ఈవి పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సామాన్యులకు భారీ సబ్సిడీలు, రాయితీలు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త ఈవీ కారు కొంటే దాదాపు లక్ష రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తామంటోంది. అంతేకాదు రిజిస్ట్రేషన్ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్, ఇతర ఫీజుల నుండి 100 శాతం మినహాయింపు ఇస్తోంది. దీంతో ఈవి వాహనాలు తక్కువ ధరకే లభించనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజలు, ఉద్యోగులే కాదు ప్రజానిధులందరూ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడేలా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెహికిల్ లోన్స్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈవి వాహనాలు కొనడానికి లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
55
పెట్రోల్ వాహనాలపైనా డిస్కౌంట్స్.
తెలంగాణ ప్రభుత్వం 2024 సెప్టెంబరు నుండి స్క్రాపేజీ పాలసీ విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రంలో 3 వెహికిల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయని... రంగారెడ్డి జిల్లా కొత్తూరు, సిద్దిపేట జిల్లా వర్గల్, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్నాయన్నారు.
పాత వాహనాలు స్క్రాపింగ్ ప్రోత్సహించడానికి లయబిలిటీ మాఫీ, పన్ను రాయితీలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. పాలసీ ద్వారా స్క్రాపేజీ ప్రోత్సహించడానికి పాత వాహనం పైన ఉన్న టాక్స్ బకాయిలు రద్దు, వాహనం కొన్నప్పుడు టాక్స్ కన్షేషన్ ఇవ్వబడుతుందన్నారు. కొత్త వాహనాలు కొన్నప్పుడు టాక్స్ కాన్సేషన్ మోటార్ సైకిల్ కి రూ.5 వేల వరకు , కారులకు రూ.50 వేల వరకు , ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 19 శాతం టాక్స్ మినహాయింపు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.