ఇండియాకి ఫోర్డ్ గుడ్ బై.. తయారీతో పాటు ఉత్పత్తి ప్లాంట్లు మూసివేత..

First Published Sep 9, 2021, 6:49 PM IST

ఆటోమోబైల్ తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ సెప్టెంబర్ 9న అంటే నేడు భారతదేశంలో తయారీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా సనంద్ ఇంకా చెన్నైలోని కంపెనీ రెండు ప్లాంట్లను మూసివేయనుంది. ఈ నిర్ణయానికి కారణం భారీగా పేరుకుపోయిన నష్టాలు ఇంకా మార్కెట్‌లో వృద్ధి లేకపోవడం వల్ల అని తెలిపింది.

ford ranger

2021 నాల్గవ త్రైమాసికం నాటికి గుజరాత్‌లోని సనంద్‌లో ఎగుమతుల కోసం వాహనాల తయారీని, 2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహనం, ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తున్నట్లు అమెరికన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్ భారతదేశంలో స్థానిక తయారీ కార్యకలాపాల నిలిపివేసిన రెండవ సంస్థ. ఫోర్డ్‌కు కొన్ని సంవత్సరాల ముందు భారతదేశంలోకి ప్రవేశించిన యుఎస్ దిగ్గజం జనరల్ మోటార్స్ 2017లో భారతదేశంలో కార్ల అమ్మకాలను నిలిపివేసింది.
 

గత 10 సంవత్సరాలలో  కంపెనీకి 2 బిలియన్‌ల డాలర్ల కంటే ఎక్కువ నిర్వహణ నష్టాలు, 2019లో  0.8 బిలియన్ డాలర్ల నాన్-ఆపరేటింగ్ రైట్స్-డౌన్ అసెస్ట్స్ తరువాత ఫోర్డ్ భారతదేశంలో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణం చేయవలసి వచ్చింది.

ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సి‌ఈ‌ఓ జిమ్ ఫార్లే, ఫోర్డ్ మోటార్ కంపెనీ "మా ఫోర్డ్ ప్లస్ ప్లాన్‌లో భాగంగా సుస్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని అందించడానికి కష్టమైనగానీ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. వృద్ధి, విలువను సృష్టించడానికి మా మూలధనాన్ని కేటాయించాము. భారతదేశంలో గణనీయంగా పెట్టుబడి పెట్టినప్పటికీ ఫోర్డ్ గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిర్వహణ నష్టాలను చూసింది, కొత్త వాహనాల డిమాండ్ అంచనా కంటే చాలా బలహీనంగా ఉంది.

పార్ట్నర్షిప్, ప్లాట్‌ఫారమ్ షేరింగ్, ఇతర ఓ‌ఈ‌ఎంలతో కాంట్రాక్ట్ తయారీ, తయారీ ప్లాంట్లను విక్రయించే అవకాశం వంటి ఎన్నో ఆప్షన్స్ పరిశోధించిన తర్వాత ఈ పునర్నిర్మాణ చర్యలను తీసుకున్నట్లు ఫోర్డ్ ఇండియా పేర్కొంది.
 

"ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇన్ కంట్రీ వాహన తయారీ ఉన్న దీర్ఘకాలిక లాభాల కోసం మేము ఒక స్థిరమైన మార్గాన్ని కనుగొనలేకపోయాము. ఈ నిర్ణయం సంవత్సరాలుగా పేరుకుపోయిన నష్టాలు, పరిశ్రమల  సామర్థ్యం, భారతదేశంలో ఆశించిన వృద్ధి లేకపోవడం ద్వారా ఈ నిర్ణయానికి బలోపేతం చేసింది" అని అనురాగ్ మెహ్రోత్రా, ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు.

పునర్నిర్మాణం ద్వారా సుమారు 4,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభావాలను తగ్గించడానికి న్యాయమైన, బ్యాలెన్స్ ప్లాన్ రూపొందించడానికి చెన్నై, సనంద్‌లోని ఉద్యోగులు, యూనియన్స్, సప్లయర్స్, డీలర్లు, ప్రభుత్వం ఇతర వాటాదారులతో ఫోర్డ్ సన్నిహితంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

ఫోర్డ్ ఇండియా ఢిల్లీ, చెన్నై, ముంబై, సనంద్ ఇంకా కోల్‌కతాలో పార్ట్స్ డిపోలను నిర్వహిస్తుంది. సేల్స్ అండ్ సర్వీస్ నుండి విడిభాగాలు ఇంకా సర్వీస్  సపోర్ట్ మార్పును సులభతరం చేయడానికి, పునర్వ్యవస్థీకరించడానికి డీలర్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తుంది.

కోవిడ్ -19, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో వల్ల ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థ. జులై నాటికి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం, ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్‌స్టాల్ చేసిన సామర్థ్యంలో కేవలం 20 శాతం మాత్రమే పనిచేస్తోంది.

చెన్నై, సనంద్ తయారీ ప్లాంట్లలో ఫోర్డ్ భారతదేశంలో 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉంది,  ఈ ప్లాంట్ చిన్నది, సంవత్సరానికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్‌ల వాహన తయారీ సామర్థ్యం ఉంది.
 

1990ల మధ్యలో భారతదేశంలోకి ప్రవేశించిన ఫోర్డ్ రెండు దశాబ్దాలకు పైగా ఉన్నప్పటికీ భారతీయ ఆటోమోటివ్ రంగంలో తనదైన ముద్ర వేయడానికి చాలా కష్టపడింది. కేవలం 1.57 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థల  జాబితాలో ఫోర్డ్ తొమ్మిదవ స్థానంలో ఉంది. ఫోర్డ్ భారతదేశంలో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది - వీటిలో ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ -వీటి ధర  రూ .7.75 నుంచి రూ .33.81 లక్షల  మధ్యలో ఉంటాయి.

click me!