ఈ రాశుల వారు శృంగారంలో రెచ్చిపోతారు తెలుసా..?

First Published Nov 9, 2021, 5:13 PM IST

పడక గదిలో ఎవరు బాగా ఎంజాయ్ చేయగలరు..? ఎవరు తడపడగలరు అనే విషయాన్ని చెప్పేయవచ్చట. ఏ యే రాశులు కలయిక విషయంలో టాప్ గా ఉంటారో.. ముందే తెలుసుకుంటే.. పడకగదిలో సులభమౌతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..
 

జోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశి చక్రాలను బట్టి... వ్యక్తి వ్యక్తిత్వం గురించి చెప్పేయవచ్చు. ఈ విషయాన్ని చాలా మంది నమ్ముతుంటారు. అయితే..  మీరు నమ్మని మరో విషయం ఏమిటంటే.. రాశి చక్రాన్ని బట్టి..  పడక గదిలో ఎవరు బాగా ఎంజాయ్ చేయగలరు..? ఎవరు తడపడగలరు అనే విషయాన్ని చెప్పేయవచ్చట. ఏ యే రాశులు కలయిక విషయంలో టాప్ గా ఉంటారో.. ముందే తెలుసుకుంటే.. పడకగదిలో సులభమౌతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

తుల రాశి...

ఈ రాశివారు.. సెక్స్ విషయంలో  స్వార్థంగా ఆలోచించలేరు. శృంగారాన్ని ఆస్వాదించాలి అంటే... మానసికంగా, శారీరకంగా ఎదుటి వ్యక్తి తమను ఉత్తేజపరచాలని అనుకుంటూ ఉంటారు. తమ పార్ట్ నరే తమను కలయికను ఆస్వాదించేలా చేయాలని అనుకుంటూ ఉంటారు. వీరు ముందుగా మాత్రం పెద్దగా చొరవ చూపించరు.
 

వృషభ రాశి..
ఈ రాశివారికి ఓపిక చాలా ఎక్కువ. చాలా సహనంగా ఉంటారు. వీరికి శృంగారం విషయంలో ఎక్కువగా సుఖం కోరుకుంటారు. అయితే...  అన్ని సమయాల్లో ప్రయోగాలు చేయడం మాత్రం వీరు చేయలేరు.  ఈ రాశివారు.. తమ మధురమైన సమయాన్ని జీవితంలో ఎక్కువగా ఆనందించాలని.. ఆనందంతో ఊగిసలాడుతూ ఆస్వాదించాలని కోరుకుంటారు. హడావిడిగా సెక్స్ చేయడం వీరికి నచ్చదు. అసౌకర్యానికి గురౌతుంటారు.

మకర రాశి..
మకర రాశివారు పెట్టుబడులు పెడుతున్నట్లుగా సెక్స్ విషయంలో ఎంపిక చేసుకుంటారు.  వీరికి సెక్స్ పట్ల ఆసక్తి  చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో ఎవరితో బంధం పెట్టుకున్నా.. అది శాశ్వతంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు.  ఎదుటివారి గురించి బాగా తెలుసుకున్న తర్వాతే ఈ విషయంలో ముందడుగు వేస్తారు.

సింహ రాశి..
ఈ రాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరిపట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు. అయితే.. సెక్స్ విషయంలో వీరు ఎదుటివారిపై ఆధిపత్యం మాత్రం చూపించరు. వీరు ఎక్కువగా ప్రేమను మాత్రమే కోరుకుంటారు. పడకగదిలో న్యాయకత్వం చూపిస్తారు. అయితే... పడకగదిలో ఇలా చెయ్యాలి.. అలా చెయ్యాలి అంటూ ఎవరైనా చెబితే..  వీరికి అస్సలు నచ్చేదికాదు. అహం దెబ్బ తింటుంది.
 

కుంభ రాశి..
కుంభ రాశివారు.. చాలా సరదాగా ఉంటారు. వీరికి ఎమోషన్స్ ఎక్కువ. ఈ రాశివారు సెక్స్ కంటే ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు. కలయిక కన్నా కూడా.. ఐలవ్ యూ లాంటి పదాలను ఎక్కువగా కోరుకుంటారు.

click me!