Zodiac sign: 2026 మార్చి 26న మేష రాశిలోకి ప్రవేశించిన శుక్రగ్రహం ఏప్రిల్ 19 వరకు అదే రాశిలో ఉండనుంది. ఆ తరువాత శుక్రుడు తన స్వరాశి అయిన వృషభ రాశిలోకి మారతాడు. శుక్రుడి గోచారం రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పండితులు అంటున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, కళలు, సౌందర్యం, సంపదకు కారకుడిగా భావిస్తారు. శుక్రుడు బలంగా ఉంటే వ్యక్తి జీవితంలో విలాసం, ఆనందం, ప్రేమ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వివాహ జీవితంపై కూడా శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జనన కుండలిలో శుక్రుడు మంచి స్థితిలో ఉంటే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. శుక్రుడు వృషభ, తులా రాశులకు అధిపతి. కన్య రాశిలో శుక్రుడు నీచస్థితిలో ఉండగా, మీన రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడని జ్యోతిష్యులు చెబుతారు. శుక్రుడు శని, బుధ గ్రహాలకు మిత్రుడు. సూర్యుడు, చంద్రుడు శుక్రుడికి శత్రువులు. గురుడు, మంగళ గ్రహాలతో సమ సంబంధం ఉంటుంది.
26
శుక్ర గోచారం వల్ల వచ్చే ప్రభావాలు
శుక్రుడు మేష రాశిలో ఉండే సమయంలో ప్రపంచ స్థాయిలో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొన్ని వస్తువుల ధరలు పెరగే అవకాశం ఉంది. ఈ సమయంలో కళలు, సంగీతం, వినోద రంగాలపై ఆసక్తి పెరుగుతుంది. సినిమా, మీడియా, వినోద రంగాల్లో ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం సంబంధమైన సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలని భావిస్తున్నవారికి కూడా ఇది మంచి సమయం కావచ్చు. శుక్ర గోచారం వల్ల వ్యక్తిత్వంలో మరింత మృదుత్వం వస్తుంది. గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రమోషన్ అవకాశాలు కూడా రావచ్చు. అయితే ఈ సమయంలో అనవసర ఆలోచనలు, దారి తప్పే పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం మంచిది.
36
ఈ 5 రాశులకు శుభ ఫలితాలు
శుక్రుడి ఈ గోచారం మేష, మిథున, సింహ, ధనుస్సు, మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు రావచ్చు. పనిలో చేసిన కృషికి ప్రశంసలు లభించవచ్చు. అదృష్టం సహకరిస్తుంది. శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త అవకాశాలు కూడా రావచ్చు.
వృషభ, కుంభ, మీన రాశుల వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నా, రోజువారీ పనుల్లో చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు పెరగవచ్చు. దాంపత్య జీవితంలో కొంత అసంతృప్తి ఉండొచ్చు. పాట్నర్‌షిప్ వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది.
56
ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి
కర్కాటక, కన్య, తులా, వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. దాంపత్య జీవితంలో సమస్యలు రావచ్చు. కొన్ని వ్యక్తిగత విషయాలు బయటకు రావచ్చు. సంబంధాల్లో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న వివాదాలు, పనుల కోసం ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు.
66
శుక్ర గ్రహాన్ని ప్రసన్నం చేసుకునే పరిహారాలు
శుక్రుడి అనుకూల ఫలితాలు పొందాలంటే కొన్ని సాధారణ పరిహారాలు చేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. లక్ష్మీ దేవి లేదా జగదంబ దేవిని పూజించడం మంచిది. భోజనంలో కొంత భాగాన్ని ఆవు, కాకి, కుక్కలకు ఇవ్వాలి. శుక్రవారం ఉపవాసం ఉండటం మంచిది. తెలుపు, గులాబీ రంగు దుస్తులు ఉపయోగించడం శుభం శ్రీ సూక్తం పఠించడం మంచిది. శుక్రవారం రోజున తెల్ల దుస్తులు, పెరుగు, పాయసం, బియ్యం, వెండి వంటి వస్తువులు దానం చేయవచ్చు.
గమనిక: శుక్ర గోచారం ప్రభావం ప్రతి రాశిపై వేరుగా ఉంటుంది. అయితే జ్యోతిష్య ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే. వ్యక్తిగత కుండలి ఆధారంగా ఫలితాలు మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వివరాలను జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.