
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఈ వారం మేష రాశివారికి ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని ముఖ్యమైన అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు, శాలరీ పెరుగుదల లేదా బోనస్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిలో తోటివారితో సఖ్యతగా ఉంటే విజయాలు దక్కుతాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి.
వృషభ రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త నిర్ణయాలు కలిసివస్తాయి. కుటుంబ సంబంధాల్లో సానుకూల పరిణామాలు ఉంటాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు కలిసివస్తాయి. టైంని సరిగ్గా వినియోగిస్తే మంచి ఫలితాలు రావచ్చు.
మిథున రాశివారికి ఈ వారం ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకున్న లాభాలు సాధ్యమవుతాయి. కానీ పెద్ద ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, సమన్వయం పెరుగుతాయి. మానసిక శాంతి కోసం దైవ దర్శనాలు చేసుకుంటారు.
కర్కాటక రాశివారికి ఈ వారం వృత్తి, ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కష్టానికి తగిన ఫలిత దక్కుతుంది. వ్యాపారంలో చిన్న పాటి ప్రయాణాలు లేదా సమావేశాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి.
సింహ రాశివారికి ఈ వారం ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వృత్తిలో ప్రగతి సాధ్యమవుతుంది. ఆర్థికంగా ఇది సానుకూల సమయం. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత జీవితం సానుకూలంగా ఉంటుంది. సంబంధాలు బలపడతాయి.
కన్య రాశివారికి వృత్తి పరంగా చిన్నపాటి సవాళ్లు ఎదురవుతాయి. కానీ పట్టుదలతో వాటిని అధిగస్తారు. ఉద్యోగాలలో కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. వ్యాపారాల్లో సరైన ప్రణాళికలు అమలు చేయడం మంచిది.
తుల రాశివారికి వృత్తి, వ్యాపారంలో సానుకూల పరిణామాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు లాభాలు తెచ్చిపెడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, సంతోషం పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది.
వృశ్చిక రాశివారికి ఈ వారం ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు సాధ్యమవుతాయి. కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. సరైన ప్లానింగ్ తో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
ధనస్సు రాశివారికి ఈ వారం ఉద్యోగం, వ్యాపారంలో ప్రగతి కనిపిస్తుంది. త్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు. కుటుంబంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సరైన ప్రణాళికలు, నిర్ణయాలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు చూడవచ్చు.
మకర రాశివారికి వృత్తి, ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. నూతన వాహన యోగం ఉంది.
కుంభ రాశివారికి ఈ వారం కొత్త అవకాశాలు, విజయాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమ, వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. వృత్తి, వ్యాపారాలలో సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.
మీన రాశివారికి ఈ వారం వృత్తి, వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, అనవసర ఖర్చులు తగ్గిస్తారు. ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి.