మీన రాశికి అధిపతి గురు గ్రహం. ఈ గురుడు జ్ఞానం, ధర్మం, సంపద, అదృష్టానికి కారకుడిగా చెప్పుకుంటారు. రాహువు లేదా కేతువు మీన రాశిలో ప్రవేశించినప్పుడు, ఆ వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది. చెడు అలవాట్లు మొదలుపెడతారు. మాదకద్రవ్యాలకు బానిస కావచ్చు. మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించలేకపోతారు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు.