మీన రాశిలోకి శని వక్రత్యాగం.. ఈ 5 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం

Published : Nov 28, 2025, 07:31 AM IST

Zodiac sign: అత్యంత శ‌క్తిమంత‌మైన గ్ర‌హాల్లో శ‌ని గ్ర‌హం ప్ర‌ధాన‌మైంది. నెమ్మ‌దిగా ప్ర‌య‌ణించే శ‌ని ప్ర‌భావం అన్ని రాశుల‌పై ప‌డుతుంది. తాజాగా న‌వంబ‌ర్ 28న శ‌ని వ‌క్ర‌త్యాగం ప్ర‌భావంతో 5 రాశుల‌పై తీవ్ర‌మైన ప‌డ‌నుంది. ఇంత‌కీ ఆ రాశులు ఏంటంటే.? 

PREV
16
మీన రాశిలో శని వక్రత్యాగం

నవంబర్ 28 నుంచి శని మీన రాశిలో వక్రత్యాగం చేయడంతో సంవత్సరాంతం వరకూ గట్టి ప్రభావం కనిపించనున్నట్లు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణ, శ్రమ, ఒత్తిడి తీసుకురాగల గ్రహంగా ప్రసిద్ధి పొందిన శని ఈసారి ఐదు రాశులపై గణనీయ ఒత్తిడి పెంచే సూచనలు ఉన్నాయి. ఇంటి పని, ఉద్యోగ ఒత్తిడి రెండూ పెరిగే అవకాశం కనిపిస్తోంది. శని ప్రసన్నం కావడానికి నల్లటి వస్త్రాలు ధ‌రించ‌డం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శివార్చన చేయించడం మంచిద‌ని పండితులు సూచిస్తున్నారు.

26
మిథునం – కెరీర్ ఒత్తిడి అత్యధికం

మిథున రాశికి శని దశమ స్థానంలో ఉన్నందున వృత్తి, ఉద్యోగ రంగాల్లో భారం త‌ప్ప‌దు. ఉన్నతాధికారులు కఠినమైన లక్ష్యాలు నిర్దేశించే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వ‌స్తుంది. విశ్రాంతి తగ్గిపోవచ్చు. వ్యాపారాలలో శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న పనులు కూడా అదనపు సమయం తీసుకుంటాయి.

36
సింహం – అదనపు బాధ్యతలు, అనుకోని మార్పులు

సింహ రాశికి శని అష్టమ స్థానంలో ఉండడంతో ఉద్యోగభారం తగ్గే అవకాశం లేదు. కార్యాలయ వాతావరణంలో ఒత్తిడి పెరగవచ్చు. అధికారులు అసహనంగా ప్రవర్తించే సూచనలు ఉన్నాయి. ఇష్టం లేని బదిలీలు కావ‌చ్చు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఇంట్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.

46
కన్య – శ్రమకు త‌గ్గ ఫ‌లితం ల‌భించ‌దు

కన్య రాశిలో శని సప్తమ స్థానంలో ఉండటంతో ఉద్యోగంలో భారమైన పనులు తప్పవు. అదనపు బాధ్యతలు చేరతాయి. వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కంటే వాటి అమలు కష్టపడే అవకాశం ఉంది. ఆదాయం పెంపు కోసం చేసే ప్రయత్నాలు శ్రమను మరింత పెంచుతాయి. కుటుంబ ప‌రంగా కూడా ప్రయాణాలు తప్పవు. వ్యక్తిగత, ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

56
ధనుస్సు – ప‌నులు పూర్తి కావు

శని చతుర్థ స్థానంలో ఉండటంతో ప్రతీ పని భారంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం, వృత్తి రంగాల్లో విశ్రాంతి దొరకని పరిస్థితి ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం కావచ్చు. ఆస్తి, డబ్బు సంబంధ విషయాలలో అదనపు జాగ్రత్త అవసరం. ప్రయాణాలు లాభం కంటే ఖర్చు ఎక్కువ తెచ్చే అవకాశం ఉంది.

66
మీనం - మాన‌సిక ఒత్తిడి

ఈ రాశిలో శని సంచారం కొనసాగుతున్నందున ముఖ్యమైన పనులు ఒక్కసారిగా పూర్తికాకపోవచ్చు. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా సాగవు. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉండే అవకాశం ఉంది. పెళ్లి చర్చల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories