హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త ఇల్లు కొనుక్కుంటున్నా, స్వయంగా కట్టుకుంటున్నా కచ్చితంగా వాస్తు చూసుకుంటారు. వాస్తు ప్రకారం సరిగా లేకపోతే ఇంట్లో సమస్యలు వస్తాయని నమ్ముతారు. అందుకే.. వాస్తు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయరు. కానీ.. వాస్తు కేవలం మన ఉండే ఇంటికి మాత్రమే సరిపోదు. మనం వ్యాపారం చేస్తున్నట్లయితే మన కంపెనీ వాస్తు విషయంలోనూ కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, వాస్తు సరిగాలేకపోతే వ్యాపారం సరిగా జరగకపోవచ్చు. ఆర్థికంగా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా.. వ్యాపారం చేసేవారు ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి? ఏం చేస్తే వ్యాపారంలో లాభాలు చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...
25
వ్యాపార విజయానికి వాస్తు..
వాస్తు శాస్త్రం పై నమ్మకం ఉంటే... మీరు కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే.. తొందరగా లాభాలు పొందవచ్చు. వ్యాపారానికి కార్యాలయాన్ని ఎంచుకొనేటప్పుడు అది ఉండే దిశను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఉత్తరం, ఈశాన్య, తూర్పు దిశలను వ్యాపార అభివృద్ధికి ఉత్తమ దిశలుగా పరిగణిస్తారు. వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఈ ప్రదేశాలను ఎంచుకోండి.
మీరు పెట్టే కార్యాలయం అయినా, దుకాణం అయినా నైరుతి , ఆగ్నేయ దిశలను నివారించండి. ఈ దిశలలో ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు కార్యాలయంలో కూర్చునే స్థలాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మీరు ఉత్తరం లేదా తూర్పు దిశకు ఎదురుగా కూర్చోవాలి. మీ వెనుక భాగం ముందు తలుపు వైపు ఉండకూడదు.
35
ఆర్థికంగా లాభాలు రావాలంటే..
కార్యాలయ ప్రవేశ ద్వారం ఉత్తరం, ఈశాన్య, తూర్పు వైపు ఉంటే ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.దక్షిణం వైపు కార్యాలయం ఉండటం సమస్యలు , ఆర్థిక నష్టానికి దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం, డబ్బు పెట్టె దిశ కూడా ముఖ్యం. డబ్బు పెట్టె ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంటే, సంపద పెరుగుతుంది. విలువైన వస్తువులను నైరుతిలో, ఉత్తర దిశకు ఎదురుగా ఉంచండి.నగదు పెట్టె ముందు అద్దం ఉంచడం వల్ల వ్యాపారంలో లాభాలు పెరుగుతాయని వాస్తు చెబుతోంది. మీ ఇంట్లో లేదా కార్యాలయంలో పగిలిన గాజు వస్తువులను ఉంచవద్దు.
కార్యాలయ గోడలపై నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులను ఉపయోగించండి. ఎరుపు, నలుపు రంగులను ఉపయోగించడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించవచ్చు.
ప్రవేశ ద్వారం బాగా వెలిగేలా చూసుకోండి. ఇది సానుకూల శక్తిని తెస్తుంది.వాయువ్య లేదా పశ్చిమ దిశలో ఉద్యోగులతో సంభాషించడానికి గదిని ఉంచండి. దానిని నైరుతి దిశలో ఉంచవద్దు.
55
దేవుడిని పూజించడం..
అంతేకాకుండా.. మీ వ్యాపార స్థలంలో మీకు బాగా నచ్చిన, మీరు నమ్మిన దేవుడి ఫోటోని, లేదా ప్రతిమను ఉంచుకోండి. దానిని రోజూ శుభ్రం చేసి పూజ చేస్తూ ఉండండి. దీని వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇక.. మీ వ్యాపార కార్యాలయంలో రిసెప్షన్ ఏరియా ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉండటం మంచిది.