Today Rasi Phalalu: ఈ రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి.. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు!

Published : Jun 26, 2025, 05:00 AM IST

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 26.06.2025 గురువారానికి సంబంధించినవి.

PREV
112
మేష రాశి ఫలాలు

మేష రాశివారికి అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ఆదాయం ఉండదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

212
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త పదవులు దక్కుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

312
మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల నుంచి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.

412
కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఊహించని వార్తలు వినాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కష్టం. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

512
సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి దూర ప్రయాణాల్లో ప్రమాద సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. రుణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు ఉండవు.

612
కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఆప్తుల నుంచి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ప్రముఖులతో ఉన్న పరిచయాల వల్ల అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. పాత బాకీలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

712
తుల రాశి ఫలాలు

తుల రాశివారు సోదరుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

812
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు అంతగా కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు తప్పవు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

912
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఈ రాశివారు  దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

1012
మకర రాశి ఫలాలు

మకర రాశివారు బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.  

1112
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి సోదరుల నుంచి డబ్బు పరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగవు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

1212
మీన రాశి ఫలాలు

మీన రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories