నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా తెలివైన వారు. చాలా నమ్మకంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చి నెలలో విజయావకాశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ పెరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ నెలలో లాభాలు అందుకుంటారు.
నెంబర్ 9..
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చి నెలలో అద్భుతంగా ఉండనుంది. ఈ నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాల ఉన్నాయి. విపరీతంగా చేతికి డబ్బు అందుతుంది.