జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు, ప్రతి నక్షత్రానికి, ప్రతి గ్రహస్థితికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వ్యక్తి జన్మించిన నెల వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, ఆర్థిక స్థితి, అదృష్టయోగాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కొన్ని నెలల్లో పుట్టినవారికి సహజంగానే ధనయోగం బలంగా ఉంటుందట. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండే కాలం, గురుగ్రహ ప్రభావం అధికంగా ఉండే సమయం, శుక్రుడి అనుకూల దృష్టి వంటి అంశాలు ఈ నెలల్లో జన్మించినవారికి ఆర్థికంగా ఎదగడానికి బలమైన పునాది వేస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఏ నెలలో పుట్టినవారికి డబ్బులకు లోటుండదో ఇక్కడ చూద్దాం.