astrology: వార ఫలాలు( 21 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి)

First Published Feb 21, 2020, 9:14 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి బంధువులతో తగాదాలు. ముఖ్యమైన  పనులు కొంత మందకొడిగా సాగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. అయితే అవసరాలకు లోటు ఉండదు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మేషరాశికి :- ఈ వారం వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు కొంత మందకొడిగా సాగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. అయితే అవసరాలకు లోటు ఉండదు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి :- ఈ వారం ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు అవశాలు దక్కి ఉత్సాహవంతంగా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. అనుకోని ప్రయాణాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిథునరాశి :- ఈ వారం ఇంటిలో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వ్యాపారులకు ఊహించని పురోగతి కనిపిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో కలహాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు చాలావరకూ తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. మీ అంచనాలు నిజమయ్యే సమయం. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి:- ఈ వారం వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుతారు. బంధువులు, మిత్రులతో వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో ఒత్తిడులు ఎదురవుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి:-ఈ వారం వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. తగినంత లాభాలు కూడా దక్కుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి పట్టింది బంగారమే అవుతుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. ఇంటిలో వేడుకలు నిర్వహిస్తారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి:- ఈ వారం సోదరులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. తగిన జాగ్రత్త అవసరం. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగి మీ సహనాన్ని పరీక్షిస్తాయి. రాజకీయవర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. విందువినోదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి:- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. భూవివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా బాధ్యతలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి:- ఈ వారం నిర్ణయాలను సకాలంలో తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి:-ఈ వారం ఆరోగ్యం కొంత సహకరించకపోయినా లెక్కచేయరు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. కొత్త పనులకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీలో దాగిన నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి:- ఈ వారం వ్యాపారాలు విస్తరించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి మిముక్తి లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. విద్యార్థుల దీర్ఘకాలిక కల ఫలిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి:- ఈ వారం ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. చేపట్టిన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమ తప్పదు. బంధువులతో విభేదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి:- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .
undefined
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
click me!