10.09.2025 బుధవారానికి సంబంధించిన వృషభ రాశి ఫలాలు ఇవి. నేడు రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నేడు వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
25
ఆరోగ్యం
నేడు వృషభ రాశి వారికి అనేక రంగాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ప్రయాణాల వల్ల శారీరక అలసట, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. టైంకి తినకపోవడం, నిద్రలేమి వంటి అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తగిన విశ్రాంతి, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రాశివారు ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి.
35
ఆర్థిక పరిస్థితి
ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. రుణ సంబంధ సమస్యలు రావచ్చు. అప్పులు వసూలు చేయడం లేదా చేయించుకోవడంలో అవాంతరాలు ఎదురుకావచ్చు. డబ్బుకు విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు శాంతంగా ఆలోచించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. ఖర్చులు నియంత్రించకపోతే ఆర్థిక స్థితి మరింత క్షీణించవచ్చు.
ఉద్యోగాల్లో ఊహించని మార్పులు తలెత్తే అవకాశం ఉంది. బదిలీలు, ప్రమోషన్ ఆశించిన విధంగా జరగకపోవడం వంటి అంశాలు మనోభావాలను ప్రభావితం చేయవచ్చు. అధికారులతో సంబంధాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం ద్వారా పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
55
వ్యాపారం
వ్యాపారాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. లాభాలు అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు. కానీ నష్టాలు కూడా పెద్దగా ఉండవు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదు. కొత్త భాగస్వామ్యాల విషయంలో అగ్రిమెంట్లు స్పష్టంగా చేసుకోవాలి.